Breaking News

సింగర్‌ సిద్ధూ హత్య కేసు: కీలకంగా మారునున్న సెల్ఫీ!

Published on Mon, 06/06/2022 - 16:25

చండీగఢ్‌: పంజాబీ సింగర్‌ సిద్ధూ మూసేవాలా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇది ముమ్మాటికి పక్కా ప్లాన్‌ ప్రకారం చేసిన ప్రతికార హత్య అని దర్యాప్తులో తేలింది. అదీగాక అనుమానితుడు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ కూడా తన అన్నని మట్టుపెట్టినందుకు ప్రతీకారంగానే సిద్ధూని తన ముఠా సభ్యులు చంపినట్టు ఒప్పుకున్నాడు. ఈ తరుణంలో సిద్ధు హత్య జరిగిన రోజుకు సంబంధించిన సీసీఫుటేజ్‌ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.

ఆ ఫుటేజ్‌లో సిద్ధూ ఎస్‌యూవీ కారుకి సమీపంలో ఇద్దరూ వ్యక్తులు నిలుచుని ఉన్నారు. ఇద్దరిలో ఒక వ్యక్తి సెల్ఫీ కోసం సిద్ధూ వద్దకు వస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. ఆ వ్యక్తి డ్రైవర్‌ వైపుగా వచ్చి సిద్ధూతో సెల్ఫీ తీసుకున్నాడు. ఐతే ఆ వ్యక్తి సెల్ఫీ తీసుకున్న తర్వాతే.. సిద్ధూ పై జరిగింది. ఆ సమయంలోనే ‘దాడి చేయడానికి సిద్ధంకండి’ అంటూ షూటర్లకు ఒక ఫోన్‌ కాల్‌ వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు.

కానీ ఆ సీసీ ఫుటేజ్‌లో ఆ వ్యక్తుల ముఖాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులు ఆ వీడియోలో కనిపించిన ఇద్దరు వ్యక్తులను అనుమానితులుగా పరిగణిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి.. ఈ సెల్ఫీనే కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. సిద్ధూని హతమార్చిన ఎనిమిది మంది షూటర్లను పంజాబ్ పోలీసులు గుర్తించారు. ఆ షూటర్లంతా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్రాలకు చెందినవారు. నిందితుల ఆచూకి కోసం ఈ మూడు రాష్ట్రాల్లోనూ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 

(చదవండి: యస్‌.. ఇది ప్రతీకార హత్యే!: సింగర్‌ సిద్ధూ హత్య కేసులో కీలక మలుపు)

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)