Breaking News

సీఎం మార్పుపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు

Published on Fri, 12/19/2025 - 19:47

కర్ణాటక రాజకీయాలు కొంతకాలం పాటు దేశవ్యాప్తంగా హాట్ టాఫిక్‌గా నడిచాయి. ఆ రాష్ట్ర సీఎం మార్పు జరగనుందంటూ ఊహాగానాలు రేగడం దానిని బలపరూస్తూ  సీఎం, డిప్యూటీ సీఎంలు పరస్పర వ్యాఖ్యలు చేసుకోవడంతో కొద్దికాలం పాటు నేషనల్ మీడియా అటెన్షన్ అంతా ఆ రాష్ట్రంపైనే ఉంది. అయితే సీఎం మార్పు అంశంలో  తాజాగా కర్ణాటక  సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ రాష్ట్రంలో సీఎం షేరింగ్ ఒప్పందమే జరగలేదన్నారు.

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ మధ్య కొద్దికాలం పొలిటికల్ వార్ జోరుగానే సాగింది. ఐదేళ్లకు నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని సిద్ధరామయ్య అనగా ఇచ్చిన మాట కంటే గొప్పది మరోటి లేదని శివకుమార్ పేర్కొన్నారు. దీంతో ఆ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఎంట్రీతో ఇద్దరు నేతలు కొంత తగ్గి హైకమాండ్ నిర్ణయమే ఫైనల్‌ అని తెలపడంతో సీఎం కుర్చీ వార్‌కు కొద్దిగా చల్లబడిందని పొలిటికల్ వర్గాలు భావించాయి.

అయితే తాజాగా కర్ణాటక అసెంబ్లీ సమావేశాలలో సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఆర్.అశోకా సీఎం మార్పుపై అసెంబ్లీలో సిద్ధరామయ్యను ‍ప్రశ్నించారు. దానికి ఆయన బదులిస్తూ.. "ప్రజలు మమ్మల్ని దీవించారు. అనంతరం ఎమ్మెల్యేలలంతా నన్ను నాయుకుడిగా ఎన్నుకున్నారు.ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని. హైకమాండ్ నిర్ణయిస్తే తదనంతరం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగుతాను" అని సిద్ధరామయ్య అన్నారు. అసలు తానేప్పుడు రెండున్నర సంవత్సరాల సీఎం ఒప్పందం గురించి చెప్పలేదని అసలు అలాంటి అగ్రిమెంటే జరలేదన్నారు.

అయితే ఇటీవల సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ తమ వర్గం నాయకులకు ప్రత్యేక వింధు కార్యక్రమం ఏర్పాటు చేశారు. త్వరలో ఈ ఇద్దరు నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ పార్టీ అగ్ర నాయకత్వంతో భేటీ అనంతరం కర్ణాటక సీఎం మార్పుపై పూర్తి స్థాయి స్పష్టత రానుంది.అయితే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో సీఎం పదవిపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఒప్పందం జరిగిందని ప్రచారం జరిగింది. గత నెలతో రెండున్నరేళ్ల కాలం ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర సీఎం మారనున్నారని జోరుగా ప్రచారం నడిచింది. 

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)