Breaking News

సీఎం సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు

Published on Tue, 01/21/2025 - 20:11

బెంగళూరు: హోం మంత్రి జీ. పరమేశ్వర రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ చేస్తున్న డిమాండ్‌ను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఖండించారు. బీజేపీ హయాంలో మహిళలపై దారుణాలు జరగలేదా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. సీఎం హోదాలో ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరిస్తున్నాయి.  

ఇంతకి ఏం జరిగిందంటే?
సిలికాన్‌ సిటీ బెంగళూరు దారుణాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. గతవారం ఆరేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. నిన్న(సోమవారం) సాయంత్రం తన సోదరుడి ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళపై ఇద్దరు అగంతకులు హత్యాచారానికి పాల్పడ్డారు. లిఫ్ట్‌ పేరుతో మహిళను తమ వాహనంపై ఎక్కించుకున్నారు. అనంతరం, నిర్మానుష్య ప్రదేశంలో బాధితురాలి వద్ద ఉన్న డబ్బు, నగల్ని దోచుకున్నారు. ఆపై దారుణానికి ఒడిగట్టారు. దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.  

అయితే రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై బాధ్యత వహిస్తూ హోం మంత్రి రాజీనామా చేయాలని చేస్తున్న ప్రతిపక్షాల డిమాండ్‌పై  సీఎం సిద్ధరామయ్య స్పందించారు. బీజేపీ హయాంలో మహిళలపై దారుణాలు జరగలేదా? కేసులు నమోదు కాలేదా? మహిళలకు రక్షణ కల్పించాలి. కానీ సమాజంలో జరిగే చెడు పట్ల మేం కఠినంగా వ్యవహరిస్తాం’ అని అన్నారు.  

సామూహిక అ‍త్యాచార కేసులో ట్విస్ట్‌
బెంగళూరు సామూహిక అ‍త్యాచార కేసులో ట్విస్ట్‌ కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు గణేష్‌, శ్రవణ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల దర్యాప్తులో నిందితులు బాధిత మహిళ నుంచి డబ్బులు దోచుకునేందుకు యత్నించారు. కానీ బాధితురాలి వద్ద డబ్బులు లేకపోవడంతో బదులుగా లైంగిక చర్యల్లో పాల్గొనేందుకు మహిళ అంగీకరించినట్లు నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదు దోపిడీ, లైంగిక వేధింపులకు సంబంధించినది. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశాం’ అని బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ దయానంద అన్నారు.   

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)