Breaking News

18 ఏళ్ల తర్వాత తప్పిపోయిన సోదరుడిని కలిపిన ఇన్‌స్టా రీల్‌!

Published on Sun, 06/30/2024 - 09:20

లక్నో: ఇంటి నుంచి తప్పిపోయిన పులువురిని సోషల్‌ మీడియా వాళ్ల కుటుంబాలకు చేరవేస్తోంది. తప్పినపోయిన వారు చేస్తున్న ఇస్టాగ్రామ్‌ రీల్స్‌, యూట్యూబ్‌ వీడియోలు వైరల్‌గా మారటంతో వాళ్ల కుటుంబ సభ్యులు గుర్తిపట్టి మరీ అక్కున చేర్చుకుంటున్నారు. అయితే ఇలాంటి ఉద్విగ్నభరిత సీన్స్‌ను చాలా సినిమాల్లో చూశాం. కానీ, ఇప్పుడు అచ్చం ఇలాంటి ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది.

చిన్నప్పుడు ఉద్యోగం కోసం ముంబై వెళ్లిపోయిన సోదరుడిని ఒక అక్క  ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌లో చూశారు. ఆయనకు విరిగిన పన్ను ఉండటంతో తన సోదరుడేనని ఆమె గుర్తుపట్టారు. ఈ ఘటన ఆయన వెళ్లిపోయిన 18 ఏళ్ల తర్వాత జరగింది. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌లో కనిపించటంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లోని హతిపూర్‌కు చెందిన రాజ్‌కుమారి మొబైల్‌లో ఒక రీల్స్‌  చూస్తుండగా, అందులోని వ్యక్తిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. విరిగిన ఆయన పన్ను చూసి 18 ఏళ్ల కిందట  ఇంట్లో నుంచి ముంబై వెళ్లిన తన సోదరుడు బాల్‌ గోవింద్‌లా ఉన్నాడని అనుమానించారు. వెంటనే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన్న సంప్రదించారు. 

అనంతరం చిన్నప్పడు తను సోదరుడితో గడిపిన విషయాలు ప్రస్తావించారు. పాత విషయాలకు ఆయన కూడా స్పందించడంతో.. తన సోదరుడేనని రాజ్‌ కుమారి నిర్ధారణ చేసుకున్నారు. దీంతో  రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఉంటున్న ఆయన 18 ఏళ్ల తర్వాత అక్కను, బంధువులను కలుసుకున్నారు. తప్పిపోయిన తన సోదరుడిని సోషల్‌మీడియానే కలిపిందని రాజ్‌కుమారి  ఆనందం వ్యక్తం చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)