Breaking News

ఐపీఎస్‌ అంకితా శర్మకు బిగ్‌ షాక్‌.. ఇలా జరిగిందేంటి?

Published on Fri, 10/23/2026 - 10:42

దసరా వేడుకల్లో ఆయుధ పూజ తర్వాత ఏకే-47తో కాల్పులు జరిపిన ఓ మహిళా ఐపీఎస్‌ అధికారికి చిక్కులు ఎదురయ్యాయి. ఆమె కాల్పులు జరుపుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి విమర్శలకు దారితీయడంతో ఛత్తీస్‌గఢ్‌ పోలీస్‌ శాఖ స్పందించింది. ఆయుధాల వినియోగంలో భద్రతా నిబంధనలు ఉల్లంఘించారన్న అభ్యంతరాలతో రజ్‌నంద్‌గావ్‌ ఎస్పీ అంకితా శర్మకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

అక్టోబర్‌ 20న పోలీస్‌ లైన్స్‌లో సంప్రదాయ ఆయుధ పూజ నిర్వహించిన అనంతరం అంకితా శర్మ ఏకే-47తో పలుమార్లు కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఆమె చర్యను సమర్థించగా.. మరికొందరు ఆయుధాల వినియోగంలో భద్రతా ప్రమాణాలు పాటించలేదని విమర్శించారు. వీడియోపై వచ్చిన ప్రతికూల స్పందన పోలీసు శాఖ గౌరవానికి భంగం కలిగించిందని పోలీస్‌ ప్రధాన కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతా నియమాలను ఎందుకు పాటించలేదో వివరణ ఇవ్వాలని అంకితా శర్మను ఆదేశించింది. ఆమె సమాధానం అందిన తర్వాత తన అభిప్రాయాలను నమోదు చేసి పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి పంపుతానని రజ్‌నంద్‌గావ్‌ రేంజ్‌ ఐజీ అజయ్‌ యాదవ్‌ తెలిపారు. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మరోవైపు.. రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆర్‌.కే. విజ్‌ మాట్లాడుతూ.. ఆయుధ పూజలో భాగంగా కాల్పులు జరపాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే, ఛత్తీస్‌గఢ్‌లో ఆయుధ పూజ సందర్భంగా ఖాళీ తూటాలతో కాల్పులు జరపడం సంప్రదాయంలో భాగమని ఓ ఐపీఎస్‌ అధికారి పేర్కొన్నట్లు పీటీఐ తెలిపింది. అయితే, గాల్లోకి కాల్చిన తూటాలు తిరిగి కిందపడినప్పుడు సమీపంలోని వారికి గాయాలయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

మాజీ సైనికాధికారి కేజే ధిల్లాన్‌ కూడా వీడియోలో కనిపించిన ఆయుధ వినియోగంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయుధాన్ని వివిధ దిశల్లో గురిపెట్టడం, వెనుక ప్రజలు ఉండటం వంటి అంశాలు ప్రమాదకరమని పేర్కొన్నారు. అయితే, కొందరు సోషల్‌ మీడియా వినియోగదారులు అంకితా శర్మకు మద్దతుగా నిలిచారు. ఆయుధ వినియోగంలో లోపాలు ఉంటే సరిదిద్దాలని, వాటి ఆధారంగా ఆమె వృత్తిపరమైన సేవలను తక్కువ చేసి చూడకూడదని అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా, అంకితా శర్మతో పాటు అదనపు ఎస్పీ కీర్తన్‌ రాథోడ్‌ కూడా ఏకే-47తో కాల్పులు జరిపినట్లు మరో వీడియో వెలుగులోకి వచ్చింది. రాయ్‌పూర్‌, బిలాస్‌పూర్‌, రాయ్‌గఢ్‌, దుర్గ్‌, కబీర్‌ధామ్‌, బస్తర్‌ జిల్లాల్లోనూ ఆయుధ పూజ అనంతరం పోలీసులు కాల్పులు జరిపిన వీడియోలు సోషల్‌ మీడియాలో కనిపించాయి. దీంతో ఉత్సవాల సమయంలో ఆయుధాల వినియోగం, భద్రతా ప్రమాణాల అమలుపై చర్చ మొదలైంది.

ఇదీ చదవండి: ఈసీలో అంతర్గత పోరు.. కమిషనర్ల ఫిర్యాదుపై కేంద్రం వెనకడుగు!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)