Breaking News

Delhi: 2,900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం!

Published on Mon, 11/10/2025 - 20:33

వారం వ్యవధిలో.. అదీ నాలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలతో నలుగురు డాక్టర్లు అరెస్ట్‌ కావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ క్రమంలో వీళ్ల వద్ద నుంచి 2,900 కిలోల పేలుడు పదార్థాలు, రైఫిళ్లు, పిస్టల్స్, విషపదార్థాలు (రిసిన్, అమ్మోనియం నైట్రేట్) స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ పరిణామం చోటు చేసుకున్న గంటల వ్యవధిలోనే ఢిల్లీలో భారీ పేలుడు సంభవించడం గమనార్హం. 

డాక్టర్ల అరెస్టుతో బయటపడిన అంతర్జాతీయ ఉగ్ర మాడ్యూల్  వెలుగు చూసింది. ఢిల్లీ ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో అధ్యాపకుడు డా. ముజమ్మిల్ షకీల్, జమ్ము కశ్మీర్‌కు చెందిన డాక్టర్‌ అదీల్ అహ్మద్ రాథర్, గుజరాత్‌లో డాక్టర్‌ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, ఉత్తర ప్రదేశ్‌ సహారన్‌పూర్‌లో  ఓ మహిళా డాక్టర్‌ను అరెస్ట్‌ అయిన వాళ్లలో ఉన్నారు. జమ్ము కశ్మీర్, ఫరీదాబాద్ పోలీసు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో ఈ నలుగురు పట్టుబడ్డారు.  డాక్టర్లను ఎవరూ అనుమానించరనే ఉద్దేశంతో వాళ్లు ఉగ్ర సంస్థలకు టచ్‌లో ఉంటూ.. దాడులకు ప్రణాళికలు రచించినట్లు నిర్ధారణ అయ్యింది.

వీళ్లు జైష్-ఎ-మొహమ్మద్‌, అన్సార్ ఘజ్వతుల్ హింద్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నట్లు తేలింది. ఇంటర్నేషనల్ హ్యాండ్లర్లు వీళ్లను ప్రభావితం చేశారని స్పష్టమవుతోంది. అంతేకాదు.. వీళ్లలో ఇద్దరు 2018-2021 మధ్య కాలంలో కశ్మీర్‌లో గాయపడిన ఉగ్రవాదులకు చికిత్స అందించినట్లు తేలింది. దీంతో.. ఇంటెలిజెన్స్ విభాగాలు ఈ మాడ్యూల్‌ను మరింత లోతుగా పరిశీలిస్తున్నాయి. ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఉగ్రదాడిగా అనుమానాలు వ్యక్తం అవుతున్న క్రమంలో.. వీళ్లు పట్టుబడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వైట్ కాలర్ టెర్రరిజం.. 
ఇలా ప్రొఫెనల్‌ వృతుల్లో ఉంటూ ఉగ్రవాదం వైపు మళ్లడమే వైట్‌ కాలర్‌ టెర్రరిజం. మేధావులు, విద్యావంతులు, ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం లేదంటే.. ఆ చర్యలకు పరోక్షంగా సహకరించడం చేస్తుంటారు. జైష్-ఎ-మొహమ్మద్, ఇండియన్ ముజాహిదీన్, అన్సార్ ఘజ్వతుల్ హింద్ వంటి సంస్థలు ఈ మద్దతుతో లబ్ధి పొందుతున్నాయి. అలా దీని మూలాలు భారత్‌లోనూ గత కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. 1990 తర్వాత ఇది గణనీయంగా పెరిగింది. టెక్నాలజీ, గ్లోబలైజేషన్.. విద్యావంతుల మధ్య ధోరణి మార్పుల కారణంగా ఇది పెరిగిపోతోంది. సైబర్ టెర్రరిజం, ఫైనాన్షియల్ మద్దతు, బయో టెర్రరిజం వంటి ఆధునిక రూపాలను సంతరించుకుంటోంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)