Breaking News

క్యాన్సర్‌తో చిన్నారి : తోటి విద్యార్థులు కళ్లు చెమర్చేలా, వైరల్‌ వీడియో

Published on Mon, 01/19/2026 - 19:07

క్యాన్సర్‌తో పోరాడుతున్న వారికి, అటువ్యాధితో  సతమతమవడంతోపాటు,  జుట్టు ఊడిపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా తీసుకనే కీమో థెరపీ కారణంగా మొత్తం జుట్టును కోల్పోవడం సాధారణంగా చూస్తూంటాం. ఆ సమయంలో వారి మానసికవేదన వర్ణనాతీతం. అయితే అలా బాధపడుతున్న  విద్యార్థిని కోసం సహవిద్యార్థులు , ఉపాధ్యాయులు  తీసుకున్న నిర్ణయం విశేషంగా నిలిచింది.
 
క్యాన్సర్‌తో పోరాడుతున్న క్రమంలో ఒక విద్యార్థిని జుట్టు ఊడిపోవడం ప్రారంభించింది. దీంతో స్కూల్‌కు రావడానికి భయపడింది. అందరూ గేలి చేస్తారేమోనని భయపడింది. కానీ ఆ చిన్నారికి తోటి విద్యార్థులు, టీచర్లు అండగా నిలిచారు. టీచర్లు, పిల్లలు గుండు కొట్టించుకొని ఆమెకు అండగా నిలిచారు. ఈ  పోరాటంలో నువ్వు ఒంటరివి కాదు, తోడుగా  మేమూ ఉన్నామనే ధైర్యాన్నిచ్చారు. వారంతా సామూహికంగా గుండు చేయించుకుని ఆ చిన్నారిలో ధైర్యాన్ని నింపారు. 

ఇదీ చదవండి: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం : ఆ కాఫ్‌ సిరప్‌ బ్యాన్‌

 

ఇది కేవలం పాఠశాల కాదు, ప్రేమ, ధైర్యం కలగలిసిన కుటీరమని, మనిషి మనిషి ప్రేమించాలని నేర్పించే దేవాలయమని నిరూపించారు. వారు చూపించిన అప్యాయతా నురాగాలు, చేసిన గొప్ప పనిపై నెటిజన్లు ప్రశంసించారు. స్నేహానికి మారు పేరుగా నిలిచిన విద్యార్థులకు మార్గదర్శకులకు సెల్యూట్  చేయడం విశేషం. నిజానికి ఇది ఫేమ్‌ కోసమో, చప్పట్ల కోసమో చేసింది కాదు మనస్ఫూర్తిగా నిండుమనసుతో  చేసిన చర్య. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఆ చిన్నారి సంకోచం దూది పింజలా కరిగిపోయింది. అందరి కళ్లు భావోద్వేగంతో  చెమర్చే క్షణాలివి.

ఇదీ చదవండి: మ్యాట్రిమోనియల్ స్కాం : కోట్లు నష్టపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)