Breaking News

ప్రధాని మోదీతో శరద్‌ పవార్‌ భేటీ 

Published on Thu, 07/23/2026 - 04:45

న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ పరిణామాలు వే గంగా మారిపోతున్నాయి. మహారాష్ట్రలో  నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ)లోని రెండు వర్గా లు ఒక్కటైపోయి, ఎన్డీయేలో చేరుతాయన్న ఊహాగానాలు నిజమేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్సీపీ(ఎస్పీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ తన కుమార్తె సుప్రియా సూలేతో కలిసి బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై వారు చర్చించుకున్నట్లు సమాచారం.

 మోదీతో భేటీ అనంతరం శరద్‌ పవార్‌ ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. నీట్‌–యూజీ పేపర్‌పై విద్యార్థులు డిమాండ్లు, రైతుల సమస్యలు, వాటర్‌ మేనేజ్‌మెంట్, విద్యా రంగం సమస్యలపై తాము చర్చించినట్లు తెలిపారు. ఎన్సీపీలో రెండు వర్గాలున్నాయి. ఒక వర్గానికి శరద్‌ పవార్, మరో వర్గానికి ఆయన కోడలు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్ర పవార్‌ నేతృత్వం వహిస్తున్నారు. సునేత్ర పవార్‌ పార్టీ ఇప్పటికే ఎన్డీయేలో భాగస్వామిగా కొనసాగుతోంది.

 శరద్‌ పవార్‌ పార్టీ విపక్ష ‘ఇండియా’ కూటమిలో భాగస్వామి. రెండు పార్టీలు విలీనమై, ఎన్డీయేలో చేరుతాయన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల డీలిమిటేషన్‌ విషయంలో రాజ్యాంగ సవరణ బిల్లులు పార్లమెంట్‌లో ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. ఈ మెజార్టీ కోసం ఎన్డీయే ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఎన్సీపీలోని వర్గాలను ఏకం చేసే ప్రయత్నాలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)