Breaking News

మన్మోహన్‌ సింగ్‌పై పవార్‌ కీలక వ్యాఖ్యలు

Published on Sun, 12/31/2023 - 09:35

పుణె: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌పై ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్‌ రైతుల సమస్యల పరిష్కారంపై  సానుకూలంగా ఉండేవారని ప్రస్తుతం రైతుల సమస్యలను పట్టించుకునే వారే లేరన్నారు. రైతుల ఆత్మహత్యల గురించి తెలుసుకుని ప్రధానిగా ఉన్నపుడు మహారాష్ట్ర అమరావతి ప్రాంతంలో మన్మోహన్‌ పర్యటించారని పవార్‌ తెలిపారు.

‘మన్మోహన్‌ సింగ్‌ సామాన్య ప్రజలు, రైతుల సమస్యల పట్ల సున్నితంగా వ్యవహరించేవారు. అందుకే ఆయన రూ.72 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశారు. ప్రస్తుతం దేశంలో రైతుల సమస్యల వైపు కన్నెత్తి చూశే వారు లేరు’ అని పవార్‌ అన్నారు. పుణెలోని శేట్కారి ఆక్రోశ్‌ మోర్చా సమావేశంలో మాట్లాడుతూ పవార్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదే కార్యక్రమంలో మాట్లాడిన శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు లేకుండా బీజేపీ కనీసం గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ పొత్తు ఈవీఎంలతోనేనన్నారు. ఈ కార్యక్రమానికి శివసేన(యూబీటీ)నేత ఉద్ధవ్‌ థాక్రేతో పాటు కాంగ్రెస్‌ నేత బాలాసాహెబ్‌ థోరట్‌, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తదితరులు హాజరయ్యారు.   

ఇదీచదవండి..సన్‌బర్న్‌ షోలో ‘శివుడి ఫొటో’.. నిర్వాహకులపై ఫిర్యాదు

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)