Breaking News

లోయర్‌ బెర్త్‌.. సీనియర్‌ సిటిజన్స్ కోసం చిట్కా వైరల్‌ వీడియో

Published on Wed, 11/12/2025 - 16:39

రైలు ప్రయాణంలో గర్భిణీలు, సీనియర్‌ సిటిజన్లు ఉన్నపుడు వారికి లోయర్‌ బెర్త్‌ కావాలని ఆశపడతాం. కానీ లోయర్ బెర్త్‌ దొరుకుతుందా అనేది నమ్మకం ఉండదు.  లోయర్‌ బార్త్‌ రాక, మిడిల్‌, అప్పర్‌ బెర్త్‌ ఎక్కలేక, పక్క వాళ్లని రిక్వెస్ట్‌ చేసుకుంటూ చాలా అవస్థలు పడాల్సి ఉంటుంది. గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్న పెద్దవాళ్లకి నిజంగా ఇది చాలా సమస్య.

అయితే  లోయర్‌ బెర్త్‌  కావాలంటే సీనియర్ సిటిజన్లు ఈ తప్పు చేయకండి అంటూ టికెట్ ఎగ్జామినర్ (TTE)  చెప్పిన చిట్కా ఇపుడు నెట్టింట  వైరల్‌గా  మారింది.సీనియర్ సిటిజన్ కోటా కింద సీట్ల కేటాయింపునకు సంబంధించి  ఈ వైరల్ వీడియో ప్రశంసలందుకుంటోంది.

తమకు లోయర్‌ బెర్త్‌ రాలేదంటూ కొందరు ప్రయాణికులు  సీనియర్ సిటిజన్లు  టికెట్‌ చెకింగ్‌కు వచ్చిన టీటీఈకి  చెప్పుకున్నారు.  అపుడు  టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఈ తప్పు చేయకండి అంటూ ఆయన  ఏం చెప్పారంటే..

"మీరు సీనియర్ సిటిజన్ కోటాను పొందాలనుకుంటే, అదీ లోయర్ బెర్త్ పొందాలనుకుంటే, ఒకే టికెట్‌లో ఇద్దరు ప్రయాణీకులను మాత్రమే బుక్ చేసుకోవాలి.  అప్పుడు బుక్ చేసిన ఇద్దరికీ లోయర్ బెర్త్  వస్తుంది,  లేదా ఇద్దరిలో ఒకరికైనా లోయర్ బెర్త్  వస్తుంది. అలా ​ కాకుండా ఒకే టికెట్‌లో ఇద్దరు కంటే ఎక్కువ మందిని చేర్చుకుంటే, కోటా ప్రయోజనాలు రద్దు అవుతాయి అంటూ టీటీసీ అసలు రహస్యాన్ని చెప్పారు.  అయితే ఇంకో సమస్య ఏంటంటే.. ఇలా   నలుగురు ఇలా బుక్‌ చేసుకున్నపుడు నలుగురికి ఒకే  చోట, లేదా ఒకే కోచ్‌లో సీట్లు వస్తాయనే గ్యారంటీ లేదు.

 

 ఆగస్టు ప్రారంభంలో ఇలాంటి ప్రశ్నకు ప్రతిస్పందనగా, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఎక్స్‌లో వివరణ ఇచ్చింది. "లోయర్ బెర్త్/సీనియర్ సిటిజన్ కోటా బెర్త్‌లు 60 ఏళ్లు , అంతకంటే ఎక్కువ వయస్సు గల పురుషులకు,  45 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల మహిళా ప్రయాణీకులకు మాత్రమే వర్తిస్తుంది.  ఒంటరిగా లేదా ఇద్దరు ప్రయాణికులతో (పేర్కొన్న ప్రమాణాల ప్రకారం) ఒకే టికెట్‌పై ప్రయాణించే టప్పుడు. ఇద్దరు కంటే ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు ఉన్నా, లేదా  ఒకరు సినీయర్‌ సిటిజన్‌ కాని వ్యక్తి ఉన్నా కోటా వర్తించదని  IRCTC పేర్కొంది.

లోయర్ బెర్త్‌లు స్వయంచాలకంగా సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు) 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల మహిళా ప్రయాణీకులకు, లభ్యతకు లోబడి కేటాయించబడతాయి. ప్రతి రైలు కోచ్‌లో, స్లీపర్ క్లాస్‌లో ఆరు నుండి ఏడు లోయర్ బెర్తులు, AC 3-టైర్‌లో నాలుగు నుండి ఐదు,  AC 2-టైర్‌లో మూడు నుండి నాలుగు సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు పైబడిన మహిళలుగర్భిణీ స్త్రీలకు రిజర్వ్ చేయబడతాయి.అదనంగా, అన్ని జోనల్ రైల్వేలలోని సబర్బన్ సెక్షన్లలోని మొదటి ,చివరి సెకండ్-క్లాస్ జనరల్ కంపార్ట్‌మెంట్లలో కనీసం ఏడు సీట్లు సీనియర్ సిటిజన్లకు రిజర్వ్ చేయబడతాయి.

బుకింగ్ సమయంలో వయస్సు రుజువు అవసరం లేనప్పటికీ, ప్రయాణీకులు ప్రయాణ సమయంలో చెల్లుబాటు అయ్యే వయస్సు గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. ఎందుకంటే  చెకింగ్‌ ఆఫీసర్లు వచ్చినపుడు, వాటిని చూపించాల్సి ఉంటుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)