Breaking News

తల్లి కాబోతున్న సీమా హైదర్

Published on Mon, 12/23/2024 - 21:37

ఢిల్లీ : ఆన్‌లైన్‌ గేమ్‌లో పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్థాన్‌ నుంచి అక్రమంగా భారత్‌కు వచ్చిన సీమా హైదర్‌ తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. తన భర్త సచిన్‌ మీనాతో కలిసి సీమా హైదర్‌  బేబీ బంప్‌తో వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ ఏడాది జులైలో పబ్‌జీ (pubg) వీడియోగేమ్‌లో గ్రేటర్ నోయిడా నివాసి సచిన్ మీనాతో ప్రేమలో పడింది. సచిన్‌ మీనాకు దూరంగా ఉండలేక తన నలుగురు పిల్లలతో సహా పాక్‌ సరిహద్దును దాటి నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా అడుగుపెట్టిన సీమా హైదర్‌ ఉదంతంలో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి.

పాక్‌ నుంచి భారత్‌కు వచ్చిన హైదర్‌ ఆరోపణలు,కోర్టు కేసుల్ని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత  నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయంలో మతం మార్చుకుని సచిన్‌ను వివాహం చేసుకున్నారు. తన మొదటి భర్త సంతానంతో పుట్టిన నలుగురు పిల్లల పేర్లు మార్చారు. నలుగురు పిల్లలతో కలిసి రెండో భర్త సచిన్‌ మీనాతో కలిసి గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్నారు. తాజాగా, త్వరలో తాను పండంటి బిడ్డకు జన్మనిస్తున్నట్లు ఓ వీడియోను విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)