Breaking News

ఘోర ప్రమాదం.. ఎస్‌యూవీ కారును ఢీకొట్టిన పాఠశాల బస్సు.. వీడియో వైరల్‌

Published on Tue, 07/11/2023 - 10:33

ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘాజియాబాద్‌లో ఓ కారును స్కూల్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి. రాహుల్‌ విహార్‌ సమీపంలోని ఢిల్లీ- మీరట్‌ ఎక్స్‌ప్రెస్‌ వే మీద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.

ఘటనకు సంబంధించిన భయంకర దృశ్యాలు స్థానికి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఇందులో  ఎస్‌యూవీ కారు, స్కూల్‌ బస్సు ఎదురెదురుగా రావడం కనిపిస్తుంది.  రాంగ్‌ రూట్‌లో వస్తున్న పాఠశాల బస్సు గురుగ్రామ్‌ వైపు వెళ్తున్న ఎస్‌యూవీ కారును ఢీకొట్టింది.  దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది.

ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. ఎనిమిదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సు రాంగ్‌ రూట్‌లో వస్తుంటే ట్రాఫిక్‌ పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు. బస్సు డ్రైవర్‌, ట్రాఫిక్‌ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆరుగురు ప్రాణాలు పోయాయని ఆరోపిస్తున్నారు. 
చదవండి: ‘70 ఏళ్ల మా అమ్మ నా పక్క సద్దుతుంది’.. అనగానే..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)