Breaking News

ఎన్నికల ముందు ఉచితాలు.. ఆ రెండు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

Published on Fri, 10/06/2023 - 13:37

జైపూర్‌: ఎన్నికల ముందు ఉచితాలను ఆక్షేపిస్తూ దాఖలైన పిటిషన్‌పై మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్డివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు కేంద్రం, ఎన్నికల సంఘం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు కూడా నోటీసులు జారీ చేసింది. ఓటర్లను ఆకట్టుకోవడానికి పన్ను చెల్లింపుదారుల డబ్బును తప్పుడు దారిలో ఖర్చుచేస్తున్నారని పిటిషన్‌దారులు ఆరోపించారు.

ఉచితాల పేరుతో ఎన్నికల ముందు ప్రజాధనాన్ని వృథాగా ఖర్చుచేస్తున్నారని ఆరోపిస్తూ భట్టులాల్ జైన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పన్ను చెల్లింపుదారులు ఇచ్చిన డబ్బును ఉచితాల రూపంలో వృథాగా ఖర్చుచేయడకుండా మార్గదర్శకాలు జారీ చేయాలని జైన్ కోరారు. ప్రజా శ్రేయస్సు పేరుతో ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఉచితాల కారణంగా రాష్ట్రాలు అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నాయని పిటిషన్‌దారుడు పేర్కొన్నారు. ఆ అప్పు ప్రభావం చివరికి పన్ను చెల్లింపుదారులపై పడుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు డబ్బు పంచడం కన్నా నీచమైన నేరం ఉండదని ధర్మాసనానికి విన్నవించుకున్నారు. ఎన్నికల ముందు ఇచ్చే రాజకీయ ప్రమాణాలను అడ్డుకోవడం సాధ్యం కాదని సీజేఐ పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని నాలుగు వారాల గడువును ఇచ్చారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)