Breaking News

మార్గదర్శి కేసు.. ఉండవల్లికి సుప్రీం కోర్టు కీలక సూచన

Published on Thu, 10/30/2025 - 12:57

సాక్షి, ఢిల్లీ: మార్గదర్శి కేసులో విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్య చేసింది. ఆర్బీఐ నిబంధనలను ఆ కంపెనీ ఉల్లంఘించిన అంశంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించాలని మాజీ ఎంపీ, అడ్వొకేట్‌ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు సుప్రీంకోర్టు గురువారం సూచింది. 

మార్గదర్శి ఫైనాన్షియర్స్  కుంభకోణంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ అలోక్ ఆరాధే ధర్మాసనం ఇవాళ వాదనలు వింది. వర్చువల్‌గా విచారణకు హాజరైన ఉండవల్లి ‘‘ఇది డిపాజిట్ల కలెక్షన్, పేమెంట్స్‌కు సంబంధించిన సమస్య మాత్రమే కాదని, మార్గదర్శి ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించిందని.. దీనిపైన విచారణ జరగాలని’’ కోరారు. అయితే.. 

ఈ అంశాలన్నీ హైకోర్టు ముందున్న ప్రధాన పిటిషన్ విచారణ సందర్భంగా  వినిపించాలని ఆయనకు ధర్మాసనం సూచించింది. ప్రస్తుతం తాము కేసు మెరిట్ లోకి వెళ్లడం లేదని.. హైకోర్టు స్టే ఇవ్వనన్న అంశంపై మాత్రమే విచారణ చేస్తున్నామని స్పష్టం చేసింది. 

ఇక.. ఈ కేసులో ఉండవల్లి అసలు ప్రతివాది కాదని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. ఆ సమయంలోనూ తాము ఎలాంటి వ్యాఖ్యానం చేయదలచుకోలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు.. మార్గదర్శి తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదిస్తూ.. తాము చెల్లించాల్సిన 2,300 కోట్ల రూపాయల డిపాజిట్లలో సింహభాగం చెల్లించామని, ఎస్క్రో ఖాతాలో 5.43 కోట్ల రూపాయలు ఉన్నాయని.. డిపాజిట్ల మెచ్యూరిటీ ఆధారంగా వాటిని చెల్లించాలని కోరారు.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)