Breaking News

బెంగాల్‌ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

Published on Mon, 09/02/2024 - 20:04

ఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోల్‌కతా ఆర్జీ కర్‌ హాస్పిటల్‌ ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘చలో సెక్రటేరియట్‌’ నిరసన హింసాత్మంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ నిరసనల్లో​ అరెస్టైన ‘పశ్చిమ్ బంగా ఛత్ర సమాజ్’ సంస్థ విద్యార్థి నాయకుడికి ఇటీవల కోల్‌కతా హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ.. బెంగాల్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం కోట్టివేసింది. 

ఈ క్రమంలో బెంగాల్‌ ప్రభుత్వ తీరుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం.. కేవలం ఒక్క సయన్ లాహిరినే  ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించింది. ‘‘ ఇది బెయిల్‌ ఇచ్చే కేసు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలా? వద్దా?  అనే విషయంలో విద్యార్థి నేత తల్లి దాఖలు చేసిన పిటిషన్‌లో హైకోర్టు తెలిపింది’ అని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని సుప్రీం కోర్టు పేర్కొంది.

‘‘చలో సెక్రటేరియట్‌’’ మార్చ్‌ నిర్వహించిన రోజు రాత్రి ఛత్ర సమాజ్‌ నిర్వాహకుల్లో ఒకరైన సయన్‌ లాహిరిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆయన తల్లి కలకత్తా హైకోర్టును ఆశ్రయించగా.. శుక్రవారం ఉన్నత న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. దీనిపై బెంగాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)