Breaking News

సిట్‌తో దర్యాప్తు చేయించండి! 

Published on Tue, 07/21/2026 - 04:44

సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ అంశంపై సమగ్ర దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేయగలరా అంటూ సుప్రీంకోర్టు సోమవారం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆరోపణల్లో నిజానిజాలు తెలుసుకునేందుకు సీనియర్‌ అధికారులతో యూపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని పేర్కొన్న సుప్రీంకోర్టు.. ఇదే బృందానికి ఈ బాధ్యతను దర్యాప్తునకు అప్పగించే విషయంపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. 

దర్యాప్తు పారదర్శకంగా జరగాలని పేర్కొంది. మందిరంలో విరాళాల గోల్‌మాల్‌ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యా(పిల్‌)లపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జాయ్‌ మాల్యా బాగ్చి, జస్టిస్‌ వి.మోహనలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దని ధర్మాసనం హితవు పలికింది. న్యాయస్థానాలు రాజకీయాలకు వేదికలు కావని, ఈ అంశాన్ని కేవలం ఒక నేరంగా మాత్రమే పరిగణించాలని స్పష్టం చేసింది. దర్యాప్తు పక్కాగా జరిగేలా చూడటమే తమ బాధ్యతని పేర్కొంది.  

దర్యాప్తు పురోగతి నివేదిక 
ఈ నెల 13వ తేదీన చేపట్టిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశించిన మేరకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా పోలీసుల దర్యాప్తు పురోగతి నివేదికను సోమవారం ధర్మాసనానికి సమర్పించారు. ఆరోపణలపై ప్రాథమిక ఆధారాలు తెలుసుకునేందుకు తొలుత ఓ ప్రత్యేక దర్యాప్తు బందాన్ని (సిట్‌) ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. నేరం జరిగినట్లు సిట్‌ ప్రాథమికంగా గుర్తించడంతో, ప్రస్తుతం రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేపట్టారని వివరించారు. స్పందించిన ధర్మాసనం.. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు కోసం సీనియర్‌ అధికారులతో కూడిన ప్రస్తుతమున్న సిట్‌కు బాధ్యతలు అప్పగించగలరా? లేదా? అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.  
 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)