Breaking News

విమాన చార్జీల అడ్డ్డగోలు పెంపు 

Published on Tue, 11/18/2025 - 05:39

న్యూఢిల్లీ: దేశంలో ప్రైవేట్‌ విమానయాన సంస్థలు ఆకస్మికంగా ప్రయాణ ఛార్జీలను, ఇతర రుసుములను పెంచకుండా నిబంధనలు పాటించేలా చూడాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసు జారీ చేసింది. సామాజిక కార్యకర్త ఎస్‌.లక్ష్మీనారాయణన్‌ వేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్‌ విక్రమ్‌ నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎకానమీ తరగతి ప్రయాణికులకు 25 కిలోల వరకు లగేజీ ఉచిత సౌకర్యం ఉండగా, దానిని ప్రైవేట్‌ విమానయాన సంస్థలు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా దీనిని 15 కిలోలకు తగ్గించాయని పేర్కొన్నారు.

అదేవిధంగా, విమాన ప్రయాణ చార్జీలు, అనుబంధ ఫీజులను నియంత్రించే వ్యవస్థంటూ ఏదీ లేకుండా పోయిందన్నారు. ఇదే అదనుగా విమాన యాన సంస్థలు ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచుతు న్నాయని, ముఖ్యంగా పండగలు, అననుకూల వాతావరణ పరిస్థితుల్లో మరీ హద్దుమీరు తున్నాయన్నారు.  పౌర విమానయాన రంగంలో ప్రయాణికులకు భద్రతతోపాటు పారదర్శకత ఉండేలా సమర్థమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి, డీజీసీఏకి, ఎయిర్‌పోర్టు నియంత్రణ ప్రాథికార సంస్థకు నోటీసులు జారీ చేసి..తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)