Breaking News

ఈసీ చేతికి ఎలక్టోరల్ బాండ్ల పూర్తి సమాచారం

Published on Thu, 03/21/2024 - 16:34

ఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. న్యూమరికల్‌ నంబర్లతో కూడిన ఎలక్టోరల్‌ బాండ్ల పూర్తి వివరాలను ఎస్‌బీఐ గురవారం ఈసీకి అందించింది. మార్చి 18న ఎలక్టోరల్‌ బాండ్లకు సంబంధించి న్యూమరికల్‌ నంబర్లతో పూర్తి వివరాలను వెల్లడించాలని ఎల్‌బీఐని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే రెండు సార్లు బాండ్ల వివరాలను ఈసీకి పంపిన ఎస్‌బీఐ.. న్యూమరికల్‌ నంబర్లతో కూడిన బాండ్ల పూర్తి వివరాలను వెల్లడించకపోవటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

తాజాగా ఎస్‌బీఐ ఎన్నికల సంఘానికి సమర్పించిన బాండ్ల పూర్తి వివరాల్లో.. ఎలక్టోరల్‌ బాండ్లు కొన్నవారి పేర్లు. బాండ్ల నంబర్లు. బాండ్లను నగదుగా మార్చుకున్న పార్టీల పేర్లు. రాజకీయ పార్టీ బ్యాంక్‌ ఖాతా నంబర్‌లో చివరి నాలుగు అంకెలు. ఏ పార్టీ ఎన్ని బాండ్లను నగదు రూపంలో మార్చుకున్న  పూర్తి వివరాలు ఉన్నాయి.

ఇక..‘బ్యాంక్‌ అకౌంట్ల భద్రత (సైబర్‌ సెక్యూరిటీ) విషయంలో రాజకీయ పార్టీల పూర్తి బ్యాంక్‌ ఖాతా నంబర్లు, కేవైసీ వివరాలు బహిర్గతం చేయటంలేదు. ఎన్నికల బాండ్ల కొనుగోలుదారుల కేవైసీ వివరాలను సైతం భద్రతా కారణాల రీత్యా వెల్లడించటం సాధ్యం కాదు. అయితే రాజకీయ పార్టీలను గుర్తించేందుకు ఆ వివారాలు అవసరం లేదు’ అని సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో ఎస్‌బీఐ పేర్కొంది. అదేవిధంగా ఎస్‌బీఐ పూర్తి ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు అందించిన అనంతరం ఈసీ తన అధికారిక వెబ్‌సైట్‌ ఈ వివరాలను  పొందుపర్చాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

చదవండి: ‘ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌’ నోటిఫికేషన్‌పై సుప్రీం స్టే

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)