Breaking News

సందేశ్‌ఖాలీ ఆందోళనలు.. నిజనిర్ధారణ కమిటీ సభ్యుల అరెస్ట్‌

Published on Sun, 02/25/2024 - 14:00

కోల్‌కతా: సందేశ్‌ఖాలీలో మహిళలపై టీఎంసీ నేతల ఆగడాల్లో నిజాలు నిగ్గు తేల్చడానికి వెళ్లిన నిజ నిర్ధారణ బృంద సభ్యులను పశ్చిమ బెంగాల్‌ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. ఈ బృందంలో తెలుగు వ్యక్తి, పాట్నా హైకోర్టు మాజీ సీజే జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి, మాజీ ఐపీఎస్‌ అధికారి రాజ్‌పాల్‌సింగ్‌, నేషనల్‌ ఉమెన్‌ కమిషన్‌ మాజీ సభ్యురాలు చారు వలి కన్నా, న్యాయవాది భావ్‌నా బజాజ్‌ ఉన్నారు.

సందేశ్‌ఖాలీకి వెళ్లకుండా పోలీసులు అరెస్టు చేసినందుకుగాను నిజనిర్ధారణ కమిటీ సభ్యులంతా ధర్నాకు దిగారు. అయితే వీరిని శాంతికి విఘాతం కలిగిస్తున్నారన్న కారణంతో ముందస్తు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘మేం సందేశ్‌ఖాలీకి వెళ్లి బాధిత మహిళలతో మాట్లాడాలనుకున్నాం. కానీ పోలీసులు వెళ్లనివ్వకుండా మమ్మల్ని కావాలని అరెస్ట్‌ చేసి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.సెక్షన్‌ 144ను ఉల్లంఘించబోము అని చెప్పినా పోలీసులు వినడం లేదు’అని నిజనిర్ధారణ కమిటీ సభ్యురాలు చారుకన్నా తెలిపారు.

కాగా, పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాలీలో టీఎంసీ నేత షాజహాన్‌  షేక్‌, అతని అనుచరులు తమపై లైంగిక దాడులు చేసేందుకు, తమ భూములు  లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని అక్కడి మహిళలు కొంత కాలంగా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనల నేపథ్యంలో షాజహాన్‌ఖాన్‌ ఇంటిపై ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దాడులు కూడా జరిపింది. దాడులు జరుపుతున్న సమయంలో​ షాజహాన్‌ఖాన్‌ మనుషులు ఈడీ సిబ్బందిపై దాడి చేసి వారి వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి షాజహాన్‌ఖాన్‌ పరారీలో ఉన్నాడు. 

ఇదీ చదవండి.. మమత అక్క కాదు.. గయ్యాలి అత్త

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)