అయ్యప్ప దర్శనం కోసం బారులు తీరిన జనం..నాడ మూసివేత..

Published on Sat, 12/06/2025 - 12:24

సాక్షి శబరిమల: సన్నిధానం వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఈ రాత్రికి నాడ మూసివేస్తే రేపు తెల్లవారుజామున 3 గంటల వరకు యాత్రికులను 18వ మెట్టు ఎక్కడానికి అనుమతించరు. ఆ తర్వాత భద్రతలో భాగంగా, పోలీసులు, కేంద్ర దళాలు CRPF, RAF, NDRF, యాంటీ టెర్రర్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, స్పెషల్ బ్రాంచ్ పోలీసుల సంయుక్తంగా రూట్ మార్చ్ నిర్వహించనున్నారు.

నాడ మూసివేత అంటే..
నాడ అంటే శబరిమల అయ్యప్ప ఆలయానికి వచ్చే ప్రధాన మర్గం. ఇది అయ్యప్ప భక్తులకు, ముఖ్యంగా దీక్షధారులకు అతి ముఖ్యమైనది. సింపుల్‌గా చెప్పాలంటే అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునే మెట్ల మార్గం. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచే ఆలయ ప్రవేశ మార్గం. అందువల్ల ఈ మెట్లమార్గం గుండా ఉండే ప్రధాన ద్వారాన్ని మూసివేస్తే..భక్తులను 18వ మెట్టు  ఎక్కడానికి అనుమతించరు. ఇక్కడే స్వామివారికి ఆలయ పూజారులు విశేష పూజలు జరుపుతారు. భక్తులు తెచ్చే ఆవునేతితో అయ్యప్పకు అభిషేకం చేస్తారు.

ఇదిలా ఉండగా, సన్నిధానం పంపా, నీలక్కల్‌ వద్ద అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. రాత్రి నాడ మూసివేశాక, తిరుముట్టం, దాని పరిసరాలు ప్రత్యేక పోలీసుల రక్షణలో ఉంటాయి. ఎప్పుడైతే నాడ మూసివేస్తారో ఆ తదనంతరం యాత్రికులను పాపంతల్‌ వద్ద క్యూలో నిలబెడతారు. రేపు తెల్లవారుజామున 3 గంటలకు నాడ తెరిచిన తర్వాత మాత్రమే భక్తులను 18వ మెట్టు ఎక్కడానికి అనుమతిస్తారు. 

సన్నిధానం వైపు ట్రాక్టర్ల తరలింపును రెండు రోజులుగా పరిమితం చేశారు. ట్రాక్టర్లలో తీసుకువచ్చిన వస్తువులను కూడా తనిఖీ చేస్తారు. గుర్తింపు కార్డు లేకుండా ఎవరిని సిబ్బంది ద్వారం గుండా తిరుముట్టంలోకి ప్రవేశించడానికి అనుమతించరు. ఈ ప్రాంతంలో నిఘా ముమ్మరంగా ఉంటుంది. ఇక ఫుట్‌పాత్‌ వద్ద దర్శనం ప్రారంభంలో స్కానర్లు డోర్‌ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్లు, హోల్డ్‌ మెటల్‌ డిటెక్టర్లు ఉపయోగించే స్రీనింగ్‌ తనిఖీ తదితరాలు పర్యవేక్షణ ఉంటుంది.

(చదవండి:  పులిమేడు రూట్‌లో భక్తుల రద్దీ)

 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు