Breaking News

తెరుచుకున్న శబరిమల.. భక్తులకు సూచనలివే..!

Published on Sun, 11/16/2025 - 17:00

పథనంతిట్టశబరిమలలో కొలువైన హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి సన్నిధానం ఈరోజు (నవంబరు 16) సాయంత్రం 5 గంటలకు తెరుచుకుంది. మేల్‌శాంతిగా ఎంపికైన ప్రసాద్ నంబూద్రి శనివారం ఉదయం పంపా బేస్ వద్ద ఇరుముడి కట్టుకుని, ఆదివారం సాయంత్రానికి సన్నిధానం చేరుకున్నారు. పద్దెనిమిది మెట్లను అధిరోహించిన తర్వాత ఆయన శబరిమల సన్నిధానం ద్వారాలకు హారతి ఇచ్చి, ఆలయం తలుపులును తెరిచారు. ఆ వెంటనే.. ‘స్వామియే.. శరణం అయ్యప్పా’ అనే భక్తుల శరణుఘోషలతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది.

మండల పూజ సీజన్‌లో శబరిమలకు వచ్చే భక్తుల కోసం కేరళ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు మౌలిక సదుపాయాలను కల్పించింది. అదేవిధంగా కేరళ వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. వైద్య కళాశాల ప్రొఫెసర్లు మొదలు.. పీజీ విద్యార్థులను రంగంలోకి దింపి.. శబరిమల మార్గంలో ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు, తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. పంపాబేస్‌లో 24 గంటలూ పనిచేసేలా వైద్య కేంద్రం పనిచేస్తుందని అధికారులు తెలిపారు. వైద్య శిబిరాలు ఎక్కడెక్కడున్నాయి? భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? అనే అంశాలపై దీర్ఘకాలిక వ్యాధులు, కొమార్బరిటీస్‌తో బాధపడే భక్తులు అత్యవసర స్థితిలో ఎవరిని సంప్రదించాలి? అనే అంశాలపై మళయాలంతోపాటు.. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో పైన పేర్కొన్న భాషల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ట్రెకింగ్ మార్గంలో..

పంపాబేస్ నుంచి శబరిమల సన్నిధానం వరకు పలు చోట్ల అత్యవసర వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా సముద్రమట్టానికి ఎత్తులో వెళ్తున్నప్పుడు శ్వాస ఇబ్బందులు ఎదురయ్యే భక్తుల కోసం ఆక్సిజన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మార్గంలో కొన్ని వైద్య కళాశాలలు బేస్ ఆస్పత్రులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పథనంతిట్ట జనరల్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ కార్డియాలజీ ట్రీట్ మెంట్, క్యాథ్ ల్యాబ్ ట్రీట్ మెంట్ అందుబాటులో ఉన్నట్లు వివరించారు. పంపాబేస్ వద్ద అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. పంపాకు సమీపంలో ఉన్న అన్ని ఆస్పత్రులలో డీఫిబ్రిలేటర్లువెంటిలేటర్లుకార్డియాక్ మానిటర్లు ఉంటాయని తెలిపారు. నీలక్కల్ బేస్ వద్ద పూర్తిస్థాయి ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. శబరిమల చరిత్రలోనే తొలిసారి పంపాబేస్, సన్నిధానం వద్ద ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించారు. అటు అయ్యప్పస్వామి వంశస్తుల రాజ్యంగా పేర్కొనే పందలం వద్ద కూడా తాత్కాలిక డిస్పెన్సరీలు ఏర్పాటయ్యాయి. శబరిమలకు వచ్చే మార్గాల్లో అడూర్, వడసేరిక్కర, పథనంతిట్టల్లోనూ 24 గంటలు పనిచేసే ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయి.

 

భక్తులకు ప్రభుత్వ సూచనలు

  • ప్రస్తుతం వివిధ వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు తమ వైద్య రికార్డులను వెంట తెచ్చుకోవాలి

  • శబరి యాత్రకు కొద్దిరోజుల ముందు నుంచి నడక, తేలికపాటి వ్యాయామాలు చేయాలి

  • పంపాబేస్ నుంచి కొండను ఎక్కేప్పుడు వేగం పనికిరాదు. నిదానంగా కొండను అధిరోహించాలి. అవసరమైతే.. తరచూ విశ్రాంతి తీసుకోవాలి

  • కొండను అధిరోహించేప్పుడు అలసటఛాతీ నొప్పి రావడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే.. తక్షణం వైద్య సాయం కోసం 04735 203232 నంబరుకు కాల్ చేయాలి

  • కాచి, చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. భోజనానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి

  • వివిధ వ్యాధులతో బాధపడేవారు బహిరంగ ప్రదేశాల్లో లభించే చిరుతిళ్లను తినకూడదు

  • నీలిమల, శరణ్‌గుత్తి ప్రాంతాల్లో పాములను పట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ విషకీటకాలు కరిస్తే.. వెంటనే 04735 203232 నంబరుకు కాల్ చేయాలి. తాత్కాలిక వైద్య శిబిరాల్లో పాముకాటుకు విరుగుడు ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)