Breaking News

నాడు సుష్మా స్వరాజ్‌.. మళ్లీ ఇప్పుడు పాకిస్తాన్‌కు జైశంకర్

Published on Fri, 10/04/2024 - 17:18

ఢిల్లీ: ఇస్లామాబాద్‌లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సమావేశంలో పాల్గొనేందుకు భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ వెళ్లనున్నారు. ఎస్‌సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశాలు అక్టోబర్‌ 15-16 తేదీలో జరగనున్నాయి.  

ఈ సమావేశాలకి సంబంధించి.. పాకిస్తాన్ నుంచి ఆహ్వానం అందినట్లు భారత్‌ ఆగస్టు 30న ధృవీకరించింది. ఎస్‌సీఓ సమావేశంలో మంత్రి జైశంకర్ భేటీ అవుతారనే విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ ప్రకటించారు. 2015 డిసెంబర్ అనంతరం భారత విదేశాంగ మంత్రి పాకిస్తాన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. దివంగత మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ 2015లో ఆఫ్ఘనిస్తాన్‌కు సంబంధించి భద్రతా సదస్సులో పాల్గొనేందుకు ఇస్లామాబాద్‌ను సందర్శించారామె.

ఈసారి పాకిస్తాన్‌ అధ్యక్షతన ఎస్‌సీఓ ప్రభుత్వాధినేతల సమావేశాలు ఇస్లామాబాద్‌లో రెండురోజుల పాటు జరగనున్నాయి. ఈ శిఖరాగ్ర సమావేశాలకు ముందుగా మంత్రివర్గ సమావేశం, ఎస్‌సీఓ సభ్య దేశాల మధ్య ఆర్థిక, ఆర్థిక, సామాజిక-సాంస్కృతిక, మానవతా సహకారంపై దృష్టి సారించే విధంగా పలు సీనియర్ అధికారుల సమావేశాలు జరుగనున్నాయి.

ఇక.. రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్తాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్  దేశాల అధ్యక్షులు కలిసి.. 2001లో షాంఘైలో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్‌ను స్థాపించారు. 2017లో భారత్, పాకిస్తాన్‌లు ఎస్‌సీఓలో శాశ్వత సభ్యత్వం పొందాయి. 

గత ఏడాది జూలైలో భారతదేశం నిర్వహించిన వర్చువల్ సమ్మిట్ ఆఫ్ గ్రూపింగ్‌లో ఇరాన్ కూడా ఎస్‌సీఓలో శాశ్వత సభ్యత్వం పొందింది. ఆర్థిక, భద్రతా కూటమిగా, అతిపెద్ద ట్రాన్స్-రీజినల్ అంతర్జాతీయ సంస్థలలో ఒకటిగా ఎస్‌సీఓ ప్రారంభమైంది. గత ఏడాది ఎస్‌సీఓ సమ్మిట్‌ను భారత్‌ వర్చువల్‌గా నిర్వహించగా.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వీడియో  కాన్ఫరెన్స్‌ ద్వారా  హాజరయ్యారు.

చదవండి: ‘మీరే హిందూ మతానికి అసలైన శత్రువులు’.. పవన్‌కు డీఎంకే కౌంటర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)