కైవ్‌పై రష్యా క్షిపణి దాడి.. 21 మంది మృతి

Published on Fri, 08/29/2025 - 08:51

కైవ్‌: వరుస దాడులతో ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతోంది. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కైవ్‌పై రష్యా జరిపిన దాడిలో 21 మంది మృతిచెందారు. ఈ దాడిలో పలు ఆయుధ కర్మాగారాలు దెబ్బతిన్నాయి. రాత్రివేళ డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి రష్యా  ఈ దాడులకు తెగబడింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం క్షిపణుల దాడులతో కైవ్‌ నగరం దద్దరిల్లింది. ఈ దాడుల కారణంగా ఉక్రెయిన్‌లోని యూరోపియన్ యూనియన్ మిషన్, బ్రిటిష్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయంతో సహా కైవ్‌లోని మొత్తం 33 ప్రదేశాలలో పలు భవనాలు దెబ్బతిన్నాయి. ఈ సైనిక ఆపరేషన్ పలు ఆయుధ కర్మాగారాలు, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. కీవ్‌పై దాడులను మాస్కో ధృవీకరించింది.
 

కాగా ఉక్రెయిన్ సైన్యం ఇన్‌కమింగ్ డ్రోన్‌లను, క్షిపణులను అడ్డుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. 13 ప్రదేశాలలో రష్యా విజయవంతంగా తన దాడులను కొనసాగించింది. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు దాడులను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ దాడులలో ఇజ్రాయెల్‌ రక్షణ సంస్థ ఉక్ర్‌స్పెక్‌సిస్టమ్స్ కార్యాలయం ధ్వంసమయ్యింది. 2014లో నెలకొల్పిన ఉక్ర్‌స్పెక్‌సిస్టమ్స్‌లో మానవరహిత వైమానిక వాహనాలను తయారు చేస్తుంటారు.కాగా టర్కిష్ రక్షణ సంస్థ బేరక్తర్ నిర్వహిస్తున్న కైవ్‌లోని ఒక ప్లాంట్‌ను కూడా రష్యా ధ్వంసం చేసింది.

 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)