భారత్‌లో ఎస్‌జే–100 విమానం తయారీ

Published on Wed, 10/29/2025 - 06:13

న్యూఢిల్లీ: భారత్‌–రష్యా ప్రభుత్వరంగ సంస్థలు కలిసి తొలిసారి భారత్‌లో ఒక ప్యాసింజర్‌ విమానాన్ని ఉత్పత్తి చేయనున్నాయి. రెండు ఇంజన్లు ఉండే చిన్న ప్యాసింజర్‌ విమానం ఎస్‌జే–100ను భారత ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) తయా రు చేయనుంది. ఇందుకోసం రష్యాకు చెందిన పబ్లిక్‌ జాయింట్‌ స్టాక్‌ కంపెనీ యునైటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కార్పొరేషన్‌ (పీజేఎస్‌సీ–యూఏసీ)తో సోమవారం మాస్కోలో ఒప్పందంపై హాల్‌ సంతకం చేసింది. హాల్‌ చైర్మన్‌ డీకే సునీల్, పీజేఎస్‌సీ–యూఏసీ డైరెక్టర్‌ జనరల్‌ వదిమ్‌ బదెఖా సమక్షంలో ఈ సంతకాలు జరిగాయి.

‘దేశంలో తక్కువ దూరం విమాన ప్రయా ణాలను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన ఉడాన్‌ పథకంలో ఎస్‌జే–100 విమానాలు గేమ్‌చేంజర్‌ కానున్నాయి. దేశీయ విమానయాన సంస్థల కోసం ఎస్‌జే–100 విమానాలను తయారు చేసేందుకు ఈ ఒప్పందం ద్వారా హాల్‌కు హక్కులు లభించాయి. ఈ విమానాల తయారీ దేశంలో విమానయాన పరిశ్రమలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. పౌర విమానయాన రంగ ఆత్మనిర్భర్‌ భారత్‌ కలను సాకారం చేస్తుంది. ఈ ఒప్పందం విమానయానంలో ప్రైవేటు రంగాన్ని ప్రో త్సహించి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలను సృష్టిస్తుంది’అని హాల్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)