Breaking News

మరి మీరు చేసిందేంటి?.. నిర్మలకు స్టాలిన్‌ కౌంటర్‌

Published on Mon, 03/17/2025 - 07:40

చెన్నై: తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కొద్దిరోజులు కేంద్రం వర్సెస్‌ స్టాలిన్‌ అనే విధంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూపాయి సింబల్‌ను తొలగించడం మరింత చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కౌంటరిచ్చారు.

తాజాగా ఓ కార్యక​్రమంలో సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ..‘గతంలో ఓ సందర్భంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ స్వయంగా ఆంగ్ల ‘రూ’కి బదులుగా తమిళంలోని ‘రూ’ అనే అర్థం సూచించే అక్షరాన్ని వినియోగించారు. మరి ఇప్పుడు మా ప్రభుత్వం కూడా ‘రూ’ అనే అక్షరాన్ని వినియోగించడం కూడా సరైనదే కదా. ప్రస్తుతం భాషపై జరుగుతున్న వివాదంలో మా వైఖరిని మేము తెలియజేస్తున్నాం. మా మాతృ భాషను రక్షించుకుంటున్నాం. భాషపై గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించాలనుకునే వారు కేంద్రమంత్రి చర్యపైనా ఇప్పుడు మాట్లాడండి’ అని ఘాటు వ్యాఖ్యలు సంధించారు. ఇదే సమయంలో మరికొందరు మాత్రం జాతీయ చిహ్నాన్ని తక్కువ చేసి చూపించారని ఆయన మండిపడ్డారు. దీంతో, ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

ఇదిలా ఉండగా.. జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు-కేంద్రం​ మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక, రూపాయి విషయంలో స్టాలిన్‌ నిర్ణయాలన్ని తమిళ సంఘాలు స్వాగతించాయి. మాతృభాషను కాపాడుకొనేందుకు తీసుకొన్న చర్యగా అభివర్ణించాయి. 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)