కశ్మీర్‌ అసెంబ్లీలో ఆఖరి రోజూ ఆగని ఆందోళనలు

Published on Sat, 11/09/2024 - 05:00

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఆఖరి రోజైన శుక్రవారం కూడా ఆందోళనల మధ్యే కొనసాగింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చకు బీజేపీ సభ్యులు అడ్డుపడ్డారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలంటూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలతో హోరెత్తించారు. గొడవకు దిగిన ఎమ్మెల్యేలను స్పీకర్‌ ఆదేశాలతో మార్షల్స్‌ బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. 

లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ శుక్రవారం సీఎం ఒమర్‌ అబ్దుల్లా.. జమ్మూకశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియను కేంద్రం త్వరలోనే ప్రారంభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర పాలిత ప్రాంత హోదాతో పరిమిత అధికారాలతో అభివృద్ధిని, శాంతిభద్రతలను సాధించలేమని చెప్పారు. సమావేశాల సందర్భంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ శాసనసభా పక్షం నేత సునీల్‌ శర్మతోపాటు ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలపై ఎన్‌సీ ఎమ్మెల్యే సజ్జాద్‌ షహీన్, మరొకరు హక్కుల తీర్మానం ప్రవేశపెట్టారు. వీటిని పరిశీలించి చర్యలు తీసుకుంటానని స్పీకర్‌ రథేర్‌ చెప్పారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)