Breaking News

రూ. 11 దానికి రూ. 325 వసూలు : మరో బాంబు పేల్చిన తుకారం ముండే

Published on Wed, 09/16/2026 - 16:05

మహారాష్ట్ర FDA కమిషనర్ తుకారాం ముండే మరో  బాంబు పేల్చారు. రూ. 11 విలువైన IV సెట్ రూ. 325కి విక్రయిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.  సామాన్యుడిపై ఈ రేంజ్‌లో భారాన్నిమోపడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదని, దీనిపై జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరారు.  ఆసుపత్రుల్లో సాధారణంగా వాడే వైద్య సామాగ్రి ధరలను సమీక్షించాలనికోరారు. ఇప్పటికే ఆహార భద్రత, నిబంధనలపై విస్త్రృత దాడులు, జరిమానాలు,  రద్దు లాంటి  చర్యలతో పలు రెస్టారెంట్ల ఓనర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న తుకారం  ముండే మరో సంచలనానికి తెరలేపారు.

రిటైల్  అండ్‌  వాణిజ్య మార్కెట్లలో విక్రయించే వైద్య పరికరాల ధరల తీరును అంచనా వేసేందుకు  మహారాష్ట్ర స్టేట్ ప్రైస్ మానిటరింగ్ రిసోర్స్ యూనిట్ (MSPMRU) ,  ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (FDA) నిర్వహించిన ఒక సర్వేలో  దిగ్భ్రాంతికరమైన అంశాలు వెల్లడైనాయి.  ఆసుపత్రులలో వాడే వైద్య పరికరాలపై భారీ దోపిడీ జరుగుతున్నట్లు వెల్లడైంది. కొనుగోలు ధరకు, గరిష్ట  దరకు,  MRPకి మధ్య వందల, వేల శాతాల వ్యత్యాసం ఉన్నట్లు తేలింది.

ఈ సర్వే ప్రకారం కేవలం రూ. 11 విలువ చేసే ఐవీ సెట్ రూ. 325కి విక్రయిస్తున్నారు. అంటే  దీనిపై లాభం ఏకంగా 2,841శాతం.  రూ. 6.75 ఖరీదు చేసే 10 మి.లీ. సిరంజీని రూ. 57.20కి అమ్ముతున్నారు (747శాతం ఎక్కువ). రూ. 40-45 ఖరీదు చేసే నెబ్యులైజర్ మాస్క్ (Nebulizer Mask)  ధర రూ. 652 నుంచి రూ. 715 వరకు బిల్లు వేస్తున్నారు (సుమారు 1,687 శాతం అదనం). అంతేకాదు రూ. 29.41 కొనుగోలు ధర గల క్యాథెటర్ దాని అసలు ధర కంటే 10 రెట్లు అధికంగా విక్రయిస్తున్నారు. ఈ లెక్కలు వాణిజ్య స్థాయిలో అదుపులేని లాభార్జన జరుగుతోందని అధికారులు పేర్కొనడానికి ఈ ఫలితాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఇదీ చదవండి: ఒరాకిల్‌ను వదిలేసిన టెకీ : ఏకంగా రూ. 9 కోట్ల వ్యాపారం

ఈ భారీ ధరల పెరుగుదల అహేతుకమైనది, అన్యాయమైందీ అంటూ తుకారాం ముండే  ఈ దోపిడీని తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రిలో చేరిన రోగులకు బేరాలాడే అవకాశం లేకపోవడంతో, ట్రేడింగ్ వర్గాలు దీనిని ఆసరాగా చేసుకుని విపరీతంగా లాభాలు గడిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సాధారణ శస్త్రచికిత్స వినియోగ వస్తువులను (Surgical Consumables) డ్రగ్స్ (ప్రైసెస్ కంట్రోల్) ఆర్డర్ (DPCO), 2013 పరిధిలోకి తీసుకువచ్చి ధరలను నియంత్రించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

ఇదీ చదవండి: ఒరాకిల్‌ వెతలు : పండగా పబ్బం లేకుండా 12 ఏళ్లు చాకిరి.. చివరికి!
 

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)