Breaking News

కళ్లు బైర్లు కమ్మేలా.. ఈ ‘ఇటుకలు​’ చాలా కాస్ట్లీ గురూ..!

Published on Sat, 08/30/2025 - 19:34

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని షాడోల్ జిల్లాలో ఓ గ్రామం వార్త‌ల్లో నిలిచింది. ఇటుకలు కొనుగోలుకు సంబంధించిన బిల్లు చూస్తే షాక్‌ కొట్టినంత పనైంది. బుధ్‌హ‌ర్ బ్లాక్ ప‌రిధిలోని భ‌టియా గ్రామంలో జరిగిన ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. ఆ గ్రామ ప‌రిధిలో ఓ అంగ‌న్‌వాడీ భ‌వ‌నం ప్ర‌హ‌రీ గోడ కోసం ఇటుక‌ను కొనుగోలు చేశారు. మొత్తం 2500 ఇటుక‌ల‌ను కొనుగోలు చేయ‌గా, బిల్లును రూ.1.25 ల‌క్ష‌ల‌కు ఫైన‌ల్ చేశారు. అంటే ఒక్కో ఇటుక ఖ‌రీదు రూ.50 పడిందన్నమాట.

ఈ రేటు సాధార‌ణ ధ‌ర కంటే ప‌ది రెట్లు ఎక్కువ.. రూ. 1.25 ల‌క్ష‌ల బిల్లుపై గ్రామ స‌ర్పంచ్‌తో పాటు పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ కూడా సంత‌కం చేసి ఆమోదించారు. అనంత‌రం బిల్లులు మంజూరు చేసుకున్నారు. కాగా, ప్ర‌జా ధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ స్థానిక యువ‌త‌, గ్రామ ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. దీనిపై విచార‌ణ జ‌రిపి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఇటుకల కొనుగోలు బిల్లు పెరిబహారా గ్రామానికి చెందిన చేతన్ ప్రసాద్ కుష్వాహా పేరు మీద ఉంది. ఈ ఇటుకలను పటేరా టోలాలోని అంగన్‌వాడీ భవనం ప్రహరీ గోడ నిర్మాణానికి సరఫరా చేసినట్లు బిల్లులో పేర్కొన్నారు. షాడోల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ కేదార్ సింగ్ ఈ వ్యవహారంలో ఏదో తేడా ఉందని అంగీకరించారు. ఇలాంటి బిల్లులు నిర్లక్ష్యం వల్ల జరిగాయా లేక ఉద్దేశపూర్వక మోసమా అని తెలుసుకోవడానికి, క్లస్టర్ స్థాయి అధికారులను రోజుకు 10-12 పంచాయతీలను తనిఖీ చేయాలని   అధికారులు ఆదేశించారు.

ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదు. కొన్ని రోజుల క్రితం కుద్రి గ్రామ పంచాయతీ రెండు పేజీల ఫోటో కాపీల కోసం రూ. 4,000 మంజూరు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే, మధ్యప్రదేశ్‌లోని శాధోల్‌ జిల్లాలో ఉండే చిన్న గ్రామం భడ్‌వాహీ. వాన నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ‘జల్‌ గంగ సంవర్ధన్‌’ పేరుతో ఒక కార్యక్రమం చేపట్టింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌, ఎస్‌డీఎం, పంచాయతీ కార్యదర్శి తదితరులు హాజరయ్యారు. అంతా కలిపి 24 మంది మాత్రమే. కానీ బిల్లు మాత్రం రూ..85 వేలు అయినట్లు పెట్టారు.

వీళ్లంతా కలిసి ప్రజాధనం దోచేస్తున్నారు అనుకున్నారో ఏమో.. గుర్తు తెలియని వ్యక్తులు ఈ బిల్లును కాస్తా సోషల్‌ మీడియాలో పడేశారు. ఇంకేముంది.. ఒక్కపట్టున వైరల్‌ అయిపోయింది అది. గంట టైమ్‌లో ఈ 24 మంది అధికారులు కూర్చుని 14 కిలోల బాదాం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష తిన్నారట. ఇది చాలదన్నట్టు 30 కిలోల స్నాక్స్‌, కాఫీ/టీల కోసం ఆరు లీటర్ల పాలు.. ఐదు కిలోల చక్కెర వాడామని బిల్లులో పెట్టారు.
 


 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)