Breaking News

మంగళూరు బ్యాంకులో దోపిడీ.. ఉద్యోగులను గన్‌తో బెదిరించి..

Published on Fri, 01/17/2025 - 15:37

మంగళూరు: కర్ణాటక(Karnataka)లో వరుస దోపిడీలు హడలెత్తిస్తున్నాయి. బీదర్‌ ఘటన మరవకముందే మరో చోరీ జరిగింది. మంగళూరు(Mangalore)లోని  ఉల్లాల్ కేసీ రోడ్డులో కో-ఆపరేటివ్‌ బ్యాంకు(Co-operative Bank)లో ఉద్యోగులను గన్‌తో బెదిరించి ట్రెజరీలోని నగదు, బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. రూ.15 కోట్ల నగదు, 5 లక్షల విలువైన నగలతో పరారయ్యారు. బ్యాంక్‌ లంచ్‌టైంలో దోపిడీ జరిగింది. ఐదుగురు దొంగలు చోరీకి పాల్పడ్డారన్న ఉద్యోగులు.. బీహార్‌ గ్యాంగ్‌ పనిగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దుండగులు.. ఫియట్ కార్‌లో వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

కాగా, నిన్న(గురువారం) బీద‌ర్‌లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఏటీఎంకు డబ్బులు తరలిస్తున్న వాహనంపై దోపిడీ దొంగలు దాడి చేశారు. బైక్‌పై వచ్చిన దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్ద‌రు సెక్యూరిటీ గార్డులు మృతి చెందారు. దాడి అనంతరం డబ్బు పెట్టెతో దుండగులు అక్కడి నుంచి ఉడాయించారు. అందులో సుమారు రూ.93 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. మరోవైపు దాడి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిని అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.

ఇదీ చదవండి: అఫ్జ‌ల్‌గంజ్‌ టూ ట్యాంక్‌బండ్‌ అలర్ట్‌.. బీదర్‌ ముఠా ఎక్కడ?

ఇక దొంగ‌లు తెలంగాణ వైపు త‌మ బైక్‌ను మ‌ళ్లించిన‌ట్లు బీద‌ర్ పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో పోలీసులు బీద‌ర్ నుంచి హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో అఫ్జ‌ల్‌గంజ్‌ వ‌ద్ద దొంగ‌ల‌కు బీద‌ర్ పోలీసులు కనిపించారు. దొంగ‌ల ముఠా.. త‌ప్పించుకునేందుకు అఫ్జ‌ల్‌గంజ్‌లో ఉన్న ఓ ట్రావెల్స్ కార్యాల‌యంలోకి ప్ర‌వేశించారు. పోలీసుల‌పై కాల్పులు జ‌రుపుతుండ‌గా.. అక్క‌డే ఉన్న ట్రావెల్స్ కార్యాల‌యం మేనేజ‌ర్‌కు బుల్లెట్లు త‌గిలాయి. దీంతో అత‌నికి తీవ్ర ర‌క్త‌స్రావం జ‌రిగింది. అప్ర‌మ‌త్త‌మైన హైద‌రాబాద్ పోలీసులు కూడా బీద‌ర్ పోలీసుల‌తో పాటు దొంగ‌ల ముఠాను ప‌ట్టుకునేందుకు య‌త్నిస్తున్నారు.

 

 

 

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)