Breaking News

Heavy Rains : చెత్తనంతా తిరిగిచ్చి.. లెక్క సరిచేసి"నది"..

Published on Thu, 07/13/2023 - 19:22

న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో కురిసిన వర్షాలకు ఆయా ప్రాంతాల్లో నదులు ఉప్పొంగి వరద ఉధృతమైంది. దీంతో ఒక నదిలోని ప్లాస్టిక్ మొత్తం అక్కడున్న బ్రిడ్జి మీద పేరుకుపోవడంతో ఆ చెత్తనంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఐ.ఎఫ్.ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటలకే బాగా వైరల్ అయ్యి లక్షల మందికి చేరింది. 

కొద్దిరోజులుగా వర్షాలతోనూ, వరదలతోనూ ఉత్తరాది మొత్తం అతలాకుతలమైంది. కొన్ని ప్రాంతాల్లో గతమెన్నడూ లేనంత భారీగా వర్షాలు పడగా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఉధృతంగా వరదలు కూడా వచ్చాయి. ఈ వరదల్లో మనుషులు నదుల్లో పారేసిన చెత్త మొత్తం తిరిగి భూమి మీదకు చేరింది. 

అలా ప్లాస్టిక్ చెత్త చేరిన ఒక బ్రిడ్జిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అక్కడి ఫారెస్టు అధికారి. దీనికి అందరినీ ఆలోచింపజేసే వ్యాఖ్యను జోడించి "ప్రకృతి -1, మనిషి-0.. మనం ఏదైతే ఇచ్చామో అది మొత్తం తిరిగి వచ్చేసింది.." అని రాశారు. నడవటానికి కూడా వీలు లేకుండా ఉన్న ఈ బ్రిడ్జి వీడియోకి నెటిజనుల నుంచి విశేష స్పందన తోపాటు వ్యంగ్యమైన కామెంట్లు కూడా వచ్చాయి. ప్రకృతి ఎప్పుడూ మనుషుల ఋణం ఉంచుకోదని, ఎప్పుడు లెక్క అప్పుడే సరిచేస్తుందని.. ఎప్పటికైనా మనిషిపై ప్రకృతిదే పైచేయని రాశారు.   

ఇది కూడా చదవండి: మహిళని ఎత్తి అవతలకు విసిరేసిన బౌన్సర్లు.. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)