Breaking News

కోల్‌కతా ఉదంతం: ఆర్జీ కర్‌ ఆస్పత్రిలో అనాథ శవాల దందా!

Published on Wed, 08/21/2024 - 12:53

కోల్‌కతా: జూనియర్ డాక్టర్‌ హత్యాచారం కేసులో ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్ ఘోష్‌కు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఆయన అనేక అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో సంచలన విషయం బయటకు వచ్చింది. 

మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ అస్పత్రిలోని అనాథ శవాలను అమ్ముకునేవారని ఆర్జీ కర్‌ ఆస్పత్రి మాజీ  డిప్యూటీ సూపరింటెండెంట్‌ అక్తర్ అలీ ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్‌కు బయోమెడికల్ వ్యర్థాలు, వైద్య సామాగ్రిని అక్రమంగా రవాణా చేసేవారని అన్నారు.  2023 వరకు ఆర్జీ కర్ హాస్పిటల్‌లో తాను పనిచేశానని అక్తర్ అలీ తెలిపారు. సందీప్‌ ఘోష్‌ చట్టవిరుద్ధ కార్యకలాపాలను రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లానని అన్నారు. అంతే కాదు..ఘోష్‌పై విచారణ కమిటీలో తాను కూడా ఒక సభ్యుడిగా ఉన్నానని తెలిపారు. అయితే మాజీ ప్రిన్సిపాల్‌ విచారణలో దోషిగా తేలినప్పటికీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. 

ఇదిలా ఉండగా.. సందీప్ ఘోష్‌ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కోల్‌కతా పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నలుగురు సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేసింది. హత్యాచారం జరిగిన తర్వాత సందీప్‌ ఘోష్, బాధితురాలి వ్యక్తిగత వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ అంశంపైనా సీబీఐ కూడా సందీప్‌ ఘోష్‌ను విచారిస్తోంది. రేపటికల్లా ఘటనపై తమకు నివేదిక అందజేయాలని సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సీబీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే.

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)