Breaking News

‘బుల్డోజర్‌’ ప్రభుత్వంగా మారొద్దు!

Published on Wed, 10/02/2024 - 05:23

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో మూసీ సుందరీకరణ, చెరువుల పరిరక్షణ, హైదరాబాద్‌ అభివృద్ధి పేరిట అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేయడంపై ఆచితూచి వ్యవహరించాలని కాంగ్రెస్‌ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హితోపదేశం చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పౌరుల హక్కులను హరించి వారిని రోడ్డుపాలు చేసేలా అమానవీయంగా వ్యవహరించొద్దని, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా అధికార కొరడాను సామాన్యులపై ఝళిపించవద్దని ఏఐసీసీ పెద్దలు సూచించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనుసరిస్తున్న బుల్డోజర్‌ సంస్కృతిపై రాజకీయ, న్యాయ వేదికలపై కాంగ్రెస్‌ పార్టీ కొనసాగిస్తున్న పోరాటాన్ని ముఖ్యమంత్రికి గుర్తు చేశారు.

అదే తరహా బుల్డోజర్‌ విధానాన్ని కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రంలో అమలు చేయడం పార్టీ ప్రతిష్టకు భంగకరమని వ్యాఖ్యానించారు. ఇటీవల జమ్మూకశీ్మర్‌ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించడంతో పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పెద్దలతో చర్చించేందుకు సోమవారం రాత్రి ఢిల్లీ వచి్చన రేవంత్‌రెడ్డి మంగళవారం ఖర్గేతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో విడివిడిగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల భర్తీ వంటి అంశాలపై చర్చించారు.  

ఆ చెడ్డపేరు మనకొద్దు.. 
హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు, నిర్వాసితుల నిరసనలు, ప్రతిపక్షాల ఆందోళనలు ఆయా భేటీల్లో చర్చకు వచ్చినట్లు తెలిసింది. మూసీ పరీవాహక అభివృద్ధి విషయంలో ప్రభుత్వ లక్ష్యం, దానికోసం తీసుకున్న కార్యాచరణ, నిర్వాసితులకు ప్రభుత్వ పరంగా అందజేయనున్న మద్దతు వంటి అంశాలను సీఎం వివరించారు. ఈ సందర్భంగా ఖర్గే స్పందిస్తూ.. ‘అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ప్రభుత్వం తీసుకునే కార్యాచరణలో ముందుగా నష్టపోయేది, రోడ్డున పడేది నిమ్న వర్గాల ప్రజలే. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు వంటి కార్యక్రమాల్లో నిందితులు ఒకరైతే, బాధితులు ఇంకొకరు ఉంటారు.

నిమ్న వర్గాల పట్ల ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందనే అపవాదును ఒకసారి మూటగట్టుకుంటే దానిని తుడిచెయ్యడం అంత సులభం కాదు. అందుకే సంయమనంతో వ్యవహరించండి. ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్‌ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూల్చివేతలపై కాంగ్రెస్‌ పక్షాన నేనూ, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పోరాటం చేస్తున్నాం. బుల్డోజర్‌ పాలసీని వ్యతిరేకిస్తూ మన పార్టీ నేతలు, క్షేత్రస్థాయి కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు.

కోర్టుల్లోనూ కొట్లాడుతున్నాం. ఇలాంటి నేపథ్యంలో మనది కూడా బుల్డోజర్‌ ప్రభుత్వం అనే చెడ్డపేరు రాకూడదు..’అని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ అంశంలో ఇప్పటికే ఏఐసీసీకి ఫిర్యాదులు అందాయని, సొంత పార్టీ నేతలు సైతం ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతూ తమకు లేఖలు రాసినట్లుగా ఖర్గే చెప్పినట్లు సమాచారం. కాగా పునరావాసం, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లæ కేటాయింపు వంటి వాటిద్వారా నిరాశ్రయులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని రేవంత్‌రెడ్డి వివరించినట్లుగా సమాచారం. కాగా ఖర్గే తరహాలోనే కేసీ వేణుగోపాల్‌ సైతం ఈ వ్యవహారంపై స్పందించినట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి.  

దసరాకు ముందే.. 
మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల భర్తీపై కూడా చర్చించినట్లు తెలిసింది. నామినేటెడ్‌ పదవుల భర్తీపై పీసీసీ అధ్యక్షుడితో సహాæ ఇతర సీనియర్లను సంప్రదించి నియామకాలు చేసుకోవచ్చని పెద్దలు సూచించినట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి వచి్చన ఎమ్మెల్యేలకు కూడా నామినేటెడ్‌ పదవుల్లో కీలక కార్పొరేషన్లు ఇచ్చేందుకు వారు అంగీకరించినట్లు తెలిసింది. దసరాకు ముందే 25కు పైగా కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు భర్తీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

ఇక మంత్రివర్గ విస్తరణపై ఈ నెల 5 తర్వాత మరోమారు చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని ఏఐసీసీ పెద్దలు చెప్పినట్లు తెలిసింది. దసరాకు ముందే విస్తరణ ఉంటుందనే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. కాగా రాజ్యసభ సభ్యుడు అభిõÙక్‌ మను సింఘ్వీతో కూడా భేటీ అయిన రేవంత్, అనంతరం హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు.

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)