Breaking News

కూతురంటే ఎంత ప్రేమో.. 70ఏళ్ల వయస్సులో ఎంబీబీఎస్‌

Published on Mon, 10/14/2024 - 18:15

భువనేశ్వర్‌ : ఉద్యోగ విరమణకాగానే ‘కృష్ణా రామా’ అనుకుంటూ కాలం గడపాలనుకునేవాళ్లనే ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఈయన అలా కాదు. కన్నబిడ్డ దూరమై మిగిల్చిన విషాదం ముందు.. వయసు మీదపడి ఓపిక తగ్గే తరుణంలో ఉరకలేసే ఉత్సాహంతో నీట్ యూజీ 2020 ఫలితాల్లో ర్యాంక్‌ను సాధించారు. ఎంబీబీఎస్ విద్యార్థిగా పాఠాలు నేర్చుకుంటున్నారు. త్వరలో డాక్టర్‌గా విధులు నిర్వహించనున్నారు.

ఒడిశాకు చెందిన 64ఏళ్ల జే కిషోర్‌ ప్రధాన్‌ ఎస్‌బీఐ బ్యాంక్‌లో ఉన్నత ఉద్యోగం. ఇద్దరు కవలలు. అందమైన కుటుంబం. ఏచీకూ చింతాలేదు. ఎందుకో ముచ్చటైన ఆ కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది.

మలిదశలో తండ్రికి చేదోడువాదోడుగా ఉండాలనుకున్న కుమార్తెను దూరం చేసింది. ఆ తల్లిదండ్రుల కలలను కల్లలు చేసింది. ఇంటి వెలుగులను ఒకేసారి ఆర్పేసి చీకట్లు మిగిల్చింది.

అదుగో అప్పుడే తనలాగే మరో ఆడబిడ్డ తండ్రికి గుండె కోత మిగిల్చకూడదనుకున్నారు. డాక్టర్‌గా సేవలందించాలని దీక్షబూనారు. ఎస్‌బీఐ అసిస్టెంబ్‌ బ్యాంక్‌ మేనేజర్‌గా పదవీ విరమణ చేసినా డాక్టర్‌గా సేవలందించాలనే తన చిరకాల వాంఛను నెరవేర్చుకునే పనిలో పడ్డారు. దృఢ సంకల్పంతో  ఓ వైపు విద్యార్థి, మరోవైపు కుటుంబ బాధ్యతలను నిర్వర్తించే పెద్దగా ఇలా రెండింటిని బ్యాలెన్స్‌ చేసుకుంటూ తన కలల ప్రయాణాన్ని ప్రారంభించారు.

కుటుంబ వ్యవహారాలు, ఒత్తిళ్లు ఉన్నప్పటికీ దేశంలోనే అత్యంత కఠినమైన నీట్‌ పరీక్షల్లో ఉత్తర్ణీత సాధించాలనే లక్ష్యం ముందు అవి చిన్నవిగా కనిపించాయి. ముందుగా నీట్‌ యూజీ 2020 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు పోటీ పడ్డారు. ఆన్‌లైన్‌ క్లాసులకు అటెండ్‌ అయ్యారు. మొక్కవోని దీక్షతో అనేక సవాళ్లను అధిగమించారు. చివరికి అనుకున్నది సాధించారు.

నీట్‌ పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు. వీర్ సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (VIMSAR)లో ఎంబీబీఎస్‌ చదివేందుకు అర్హత సాధించారు. ప్రస్తుతం ఆయన ఎంబీబీఎస్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. వచ్చే ఏడాది డాక్టర్‌గా ప్రజా సేవ చేయనున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకు డబ్బు మీద ఆశలేదు. దూరమైన నా కుమార్తె కోసం నేను బతికి ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను’అని వ్యాఖ్యానించారు. ‘దేశ వైద్య విద్యా చరిత్రలో ఇదొక అరుదైన సంఘటన. ఇంత వయస్సులో వైద్య విద్యార్థిగా  అర్హత సాధించి ప్రధాన్ ఆదర్శంగా నిలిచారు’ అని విమ్స్‌ఆర్ డైరెక్టర్ లలిత్ మెహెర్ ప్రధాన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

👉చదవండి : ‘మేం ఏపీకి వెళ్లలేం’

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)