Breaking News

రాజీనామా కుదరదు!

Published on Sat, 07/25/2026 - 05:57

న్యూఢిల్లీ: నీట్‌–యూజీ పేపర్‌ లీక్‌ వివాదం నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసే అవకాశం ఎంతమాత్రం లేదని, అది ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదని ప్రభుత్వ వర్గాలు తేల్చిచెప్పాయి. పదవికి రాజీనామా చేయడం చాలా సులభమైన పనే అయినప్పటికీ.. అలా చేస్తే ప్రజలు అప్పగించిన బాధ్యత నుంచి పారి పోవడమే అవుతుందని శుక్రవారం పేర్కొన్నాయి. 

ధర్మేంద్ర ప్రధాన్‌ను తక్షణమే పదవి నుంచి తప్పించాలని కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ, ఆయన రాజీనామా చేయబోరని ప్రభుత్వం విస్పష్టంగా చెబుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘ప్రజలు మాకు అధికారాన్ని కట్టబెట్టారు. వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత మాపై ఉంది’’అని ప్రభుత్వం తేల్చిచెప్పింది. సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్‌ సింగ్‌ సమావేశమైన రోజే ప్రభుత్వ వర్గాల నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. 

పేపర్‌ లీకేజీలను అరికట్టే విషయంలో నామమాత్రపు చర్యలు చేపట్టడానికి బదులుగా, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)లో వ్యవస్థాగత లోపాలను సరిదిద్దడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్‌టీఏకు సంబంధించిన లోపాలపై సమగ్ర జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. త్వరలోనే వీటిని సరిదిద్దేందుకు కార్యాచరణ ప్రారంభం కానుంది. పేపర్‌ లీకేజీల్లో ప్రమేయం ఉన్న ముఠాలను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దోషులపై తదుపరి చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసే దాకా జంతర్‌మంతర్‌వద్ద ఆందోళన కొనసాగిస్తామని సీజేపీ ఇప్పటికే ప్రకటించింది.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)