Breaking News

రిసెప్షనిస్ట్‌ అంకిత కేసులో సంచలన తీర్పు

Published on Fri, 05/30/2025 - 12:41

దాదాపు మూడేళ్ల కిందట.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన అంకితా భండారి కేసు (Ankita bhandari Case)లో సంచలన తీర్పు వెలువడింది. లైంగిక వాంఛ తీర్చలేదని ఆమె పని చేసే రిసార్ట్‌ ఓనరే ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో ముగ్గురు నిందితులను దోషులుగా తేలుస్తూ ఉత్తరాఖండ్‌ స్థానిక కోర్టు జీవితఖైదు శుక్రవారం తీర్పు వెల్లడించింది .

పౌరీ జిల్లాకు చెందిన అంకిత భండారి(19) రిషికేష్‌లోని వంతారా రిసార్ట్‌లో రిసెప్షనిస్టుగా పని చేసేది.  అయితే 2022 సెప్టెంబర్‌ 18వ తేదీ నుంచి ఆమె కనిపించకుండా పోయింది.  నాలుగు రోజుల తర్వాత ఆమె మృతదేహం స్థానికంగా ఉన్న ఓ కాలువలో కనిపించింది. ఆమెపై హత్యాచారం జరిగి ఉండొచ్చన్న ప్రచారంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. 

పుల్కిత్‌ ఆర్య(Pulkit Arya) తండ్రి వినోద్‌ ఆర్య బీజేపీ నేత. దీంతో కేసు నుంచి అతన్ని తప్పించే  ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజకీయ విమర్శల నేపథ్యంలో వినోద్‌ను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది. కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఏర్పాటు చేశారు.

మరోవైపు..  జస్టిస్‌ ఫర్‌ అంకిత పేరుతో యువత రోడ్డెక్కింది. ఇటు సోషల్‌ మీడియాలోనూ #Justiceforankitaఉద్యమం నడిచింది. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆమె హత్యకు గురైనట్లు తేలింది. ఈ కేసులో రిసార్ట్‌ ఆపరేటర్‌ పుల్కిత్‌ ఆర్య, మరో ఇద్దరు ఉద్యోగులు సౌరభ్‌ భాస్కర్‌, అకింత్‌ గుప్తాలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే ఆమెపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్‌ నివేదిక ధృవీకరించింది. 

తన రిసార్ట్‌కు వచ్చేవాళ్లతో పాటు తనకూ పడక సుఖం అందించాలని అంకితపై పుల్కిత్‌ ఒత్తిడి తెచ్చాడు. అయితే అందుకు ఆమె లొంగలేదు. 2022 సెప్టెంబర్‌ 18వ తేదీన ఆమెతో ఈ అంశంపై వాగ్వాదానికి దిగాడు. జరిగిన పెనుగులాటలో పుల్కిత్‌, మరో ఇద్దరు సహోద్యోగులతో కలిసి ఆమెను కాలువలోకి తోసి చేశాడని తేలింది. హత్య, లైంగిక వేధింపులతో పాటు పలు నేరాల సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు.  సిట్‌ దర్యాప్తు పూర్తి చేసి 500 పేజీల ఛార్జిషీట్‌ రూపొందించింది. 

2023 మార్చి చివర్లో కోట్‌ద్వార్‌ కోర్టులో  ఈ కేసు విచారణ ప్రారంభమైంది. మొత్తం 97 మంది సాక్షుల్లో.. 47 మందిని కోర్టు విచారించింది. రెండేళ్లపాటు సాగిన విచారణ తర్వాత.. ఇవాళ(మే 30వ తేదీన0 అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి రీనా నెగి.. ఆ ముగ్గురిని దోషులుగా ప్రకటించారు. దోషులకు జీవిత ఖైదు ఖరారు కాగా.. అంకిత కుటుంబం మరణ శిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తోంది.

ఇదీ చదవండి: అలా మాట్లాడాల్సింది కాదు.. ఆమెకు క్షమాపణలు చెప్పండి

Videos

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు