Breaking News

‘ప్రధాని మోదీ చేతుల్లో భారత్ సురక్షితంగా ఉంది’

Published on Wed, 05/07/2025 - 21:34

ఆపరేషన్ సిందూర్ పేరుతో  పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై భారత్‌ జరిపిన దాడిని స్వాగతించారు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్.  ఉగ్రవాదాన్ని ఎప్పుడూ ప్రోత్సహించకూడదని, అది మానవాళి మనుగడకు అత్యంత ప్రమాదమన్నారు రవిశంకర్. ఆపరేషన్ సిందూర్ పై రవిశంకర్ మాట్లాడుతూ.. ‘ మనం నాగరిక సమాజంలో ఉన్నాం. మానవాళిని నాశనం చేసే ఉగ్రవాదులు దాడులు కానీ మిలిటెంట్ల దాడులను కానీ ఎంతమాత్రం ఉపేక్షించకూడదు

ఉగ్రవాదం అనేది ఓ ఆటవిక చర్య. భారత్ కేవలం పాక్‌లోని ఉగ్రస్థాపరాలను లక్ష్యంగా చేసుకునే దాడులు చేసింది. ఇది హర్షించదగ్గ విషయం. భారత్ చేసిన దాడులపై ఏ ఒక్కరు మాట్లాడాలన్నా మాట్లాడటానికి ఏమీ లేదు. ఎందుకంటే భారత్ కేవలం ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేసింది.

ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదాన్ని సహించబోమని పదే పదే చెబుతూ ఉన్నారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించలేదని చాలాసార్లు చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు చేయాల్సి వచ్చింది. ఇది కచ్చితంగా తెలివైన నిర్ణయమే. ప్రస్తుతం భారత్ నరేంద్ర మోదీ చేతుల్లో సురక్షితంగా ఉంది. ఆయన తీసుకునే నిర్ణయాలతో భారత్ కు మేలే జరుగుతుంది. ఆయనకు మరింత ఆత్మస్థైర్యం కలగానికి ప్రార్దిద్దాం అని రవిశంకర్ అన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)