Breaking News

అయోధ్య ట్రస్ట్‌ సీఈవో పదవికి దరఖాస్తులు ఆహ్వానం, అర్హతలేంటో!

Published on Mon, 07/13/2026 - 17:31

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని రామ మందిర విరాళాల చోరీ ఆరోపణల వివాదం కొనసాగుతుండగనే శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్రం కీలక పదవికోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ సోమవారం ఎక్స్‌లో ఒక ప్రకటనను పోస్ట్ చేసింది.

ఈ ప్రకటన ప్రకారం మూడేళ్ల పదికాలానికిగాను ఆలయ ట్రస్ట్‌ సీఈఓ పదవికి అర్హులైన అభ్యర్తులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఇందుకు జూలై 18 చివరి తేదీ అని పేర్కొంది. ఈ పదవి కాలపరిమితి మూడు సంవత్సరాలు. 50 - 70 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. జీత భత్యాలు పరస్పర చర్చల ద్వారా నిర్ణయించబడతాయని వెల్లడించింది.

ఇదీ చదవండి: యోగా గురు రామ్‌దేవ్‌ బాబా సంచలన వ్యాఖ్యలు : దుమారం


 

సీఈఓ బాధ్యతలు 
ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి లేదా సీఈఓ నేరుగా ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారు. సంస్థ అత్యున్నత కార్యనిర్వాహక అధికారిగా వ్యవహరిస్తూ, దాని చట్టబద్ధమైన, పరిపాలనా, ఆర్థిక విధులను పర్యవేక్షిస్తారు. సంస్థ లక్ష్యాలు స్థాయికి తగిన కార్యాచరణ వ్యవస్థలు, విధానాలు, పద్ధతులను అభివృద్ధి చేయాలి.  ట్రస్ట్‌ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంతో సహా, ట్రస్ట్ మొత్తం నిర్వహణకు సీఈఓ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు, అకౌంటింగ్ వ్యవస్థలు, సంస్థాగత సమాచారంలో పారదర్శకత, జవాబు దారీతనం, సామర్థ్యాన్ని ప్రోత్సహించే బాధ్యత సీఈఓకు ఉంటుంది.

ఇదీ చదవండి : 82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా?

ఈ బాధ్యతలతోపాటు  అవసరమైనప్పుడు స్థానిక, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, సంస్థ భద్రతా వ్యవస్థను కూడా సీఈఓ పర్యవేక్షిస్తారు. అన్ని మతపర ఆచారాలు, పూజలు, పండుగలు, వేడుకలను సంప్రదాయాలకు అనుగుణంగా జరిగేలా చూసే బాధ్యత ఈ పదవిపై ఉంటుంది. అలాగే ఆలయాన్ని సందర్శించే యాత్రికులు, భక్తుల భద్రత, సౌకర్యాలకు ఎలాంటి లోటు లేకుండా నిర్ధారించడం మరో ముఖ్య బాధ్యతల్లో ఒకటి. ఇంకా సంస్థను సందర్శించే విశిష్ట అతిథులు,  ప్రముఖ సాధువుల కోసం ఏర్పాట్లు చూడాలి.  ట్రస్ట్, ఆలయం రెండింటి ప్రతిష్టను పెంచడానికి కృషి చేయాలి. ట్రస్ట్ డీడ్‌లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి సీఈఓ ప్రణాళికలను రూపొందించి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు, జనరల్ సెక్రటరీ మార్గదర్శకత్వంలో నిర్వర్తించాలి.  ట్రస్ట్ లేదా ప్రధాన కార్యదర్శి ఎప్పటికప్పుడు అప్పగించే అదనపు బాధ్యతలను కూడా  సీఈవో నిర్వహించాలి.

 ఇదీ చదవండి: ఏసీ కోచ్‌లలో దుప్పట్లు, ఫేస్‌ షీట్ల చోరీ : 4 ఏళ్లలో రూ. 104 కోట్లు

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)