Breaking News

వర్షాలకు కూలిన రాజ్‌కోట్‌ ఎయిర్‌పోర్ట్‌ పైకప్పు

Published on Sun, 06/30/2024 - 05:18

రాజ్‌కోట్‌: ఢిల్లీ, జబల్పూర్‌లను అతలాకుతలం చేసిన వర్షాలు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోనూ బీభత్సం సృష్టించాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ టరి్మనల్‌ కూలిన మరుసటి రోజే మరో ఎయిర్‌పోర్ట్‌ వర్షాల బారిన పడింది. రాజ్‌కోట్‌లో అక్కడి భారీ వర్షాలకు సోమవారం ఉదయం రాజ్‌కోట్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల పికప్, డ్రాప్‌ ఏరియాపై నిర్మించిన భారీ టెంట్‌ కూలింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే టెంట్‌ కూలిన ఘటనపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది.

 ‘‘ ప్రధాని మోదీ స్వయంగా వచ్చి ఈ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించారు. 11 నెలలకే పైకప్పు కూలింది. అవినీతి ఏ స్థాయిలో ఉందో కూలిన ఘటన చాటిచెప్తోంది. ఢిల్లీ మాదిరి ఘటన వేళ అక్కడ ఎవరైనా ఉంటే జరిగే ప్రాణనష్టానికి ఎవరు బాధ్యులు?. తరచూ అవినీతిపై ప్రసంగాలు దంచే ప్రధాని అవినీతిరహిత పాలనపైనా దృష్టిసారించాలి’ అని గుజరాత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు శక్తిసిన్హ్‌ గోహిల్‌ అన్నారు.  

నెహ్రూను నిందించొద్దు: వ్యంగ్యంగా స్పందించిన బీజేపీ 
రాజ్‌కోట్‌ ఘటనపై బీజేపీ వెటకారంగా స్పందించింది. ‘‘ నిన్నటి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ టర్మినల్‌ కూటిన ఘటనతో రాజ్‌కోట్‌ ఘటనను పోల్చొద్దు. రాజ్‌కోట్‌లో పెనుగాలులకు టెంట్‌ వస్త్రం చిరిగి అది పీలికలై పడిపోయింది. తక్కువ ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించారని మీరు జవహర్‌లాల్‌ నెహ్రూను నిందిస్తారేమో. అలా చేయకండి. ఎందుకంటే ఆయన ఇన్ని విమానాశ్రయాలు నిర్మించలేరు. ఆయనకే మనం అవకాశం ఇచ్చి ఉంటే ఇప్పటికీ మనం రక్షణ పరిశోధనాభివృద్ధి  సంస్థ(డీఆర్‌డీఓ) అనుమతితో ఎడ్లబళ్లపై ప్రయాణాలు చేస్తూ ఉండేవాళ్లం’ అని బీజేపీ ఐటీ విభాగ సారథి అమిత్‌ మాలవీయ ‘ఎక్స్‌’లో ట్వీట్‌చేశారు. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి