Breaking News

రాజస్థాన్‌: ఐసీయూలో విష వాయువులు.. ఏడుగురి దుర్మరణం

Published on Mon, 10/06/2025 - 06:57

జైపూర్‌: రాజస్థాన్‌ రాజధానిలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ ఆస్పత్రి ఐసీయూలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది(Rajasthan Fire Accident). ఈ ఘటనలో మృతుల సంఖ్య 7కి చేరింది. చికిత్స పొందుతున్న వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మృతుల సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది. 

ఆదివారం అర్ధరాత్రి జైపూర్‌లోని సవాయ​ మాన్‌సింగ్‌(SMS Hospital Mishap) ఆస్పత్రిలో ఈ ఘోరం చోటు చేసుకుంది. రెండో అంతస్తులోని ఐసీయూలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్ని చెలరేగి.. ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

 ప్రమాదంలో ఐసీయూలో ఉన్న వైర్లు, ఫైల్స్‌ కాలిపోయి మంటలు మరింత వేగంగా వ్యాపించాయి. ఆపై విషపు వాయివులు వెలువడడంతో పేషెంట్లు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఈ ఘటనలో అక్కడిక్కడే ఆరుగురు చనిపోయారు. మరో ఐదుగురికి సీరియస్‌గా ఉండగా.. చికిత్స పొందుతూ ఒకరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య ఏడుకి చేరుకుంది.

 

ఘటన సమయంలో ఐసీయూ, సెమీ ఐసీయూలో కలిపి 24 మంది పేషెంట్లు ఉన్నట్లు ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. ప్రమాదంతో దట్టమైన పొగ అలుముకోగా.. ఆస్పత్రిలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రాణ భయంతో అంతా బయటకు పరుగులు తీశారు. రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి మంటల్ని అదుపు చేసినట్లు సమాచారం. 

సిబ్బందిపై ఆరోపణలు
అయితే ఘటన సమయంలో ఆస్పత్రి సిబ్బంది పేషెంట్లతో సంబంధం లేదన్నట్లు తమ ప్రాణాల కోసం పరుగులు తీశారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఘటన సమయంలో ఐసీయూ నుంచి దట్టమైన పొగ ఆస్పత్రి మొత్తం వ్యాపించిందని.. దీంతో తాము కంగారు పడ్డామని, ఆ సమయంలో మమ్మల్ని అప్రమత్తం చేయకుండా సిబ్బందే ముందుగా బయటకు పారిపోయారని వాళ్లు అంటున్నారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగగా.. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. 

అయితే ఆ ఆరోపణలను నిర్వాహకులు కొట్టిపారేశారు. తమ సిబ్బంది పేషెంట్లను బయటకు తీసుకొచ్చారని.. సీసీటీవీ ఫుటేజీలే అందుకు సాక్ష్యాలని అంటున్నారు. విష వాయువుల పొగ కారణంగా పేషెంట్లు అపస్మారక స్థితికి చేరుకున్నారని, సీపీఆర్‌తో రక్షించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయిందని వైద్యులు తెలిపారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు ప్రకటించారు.

ప్రధాని దిగ్భ్రాంతి
జైపూర్‌ ఎస్‌ఎంఎస్‌ ఆస్పత్రి విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేసిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)