Breaking News

రెండో పెళ్లితో ‘చిక్కుల్లో’ ఐపీఎస్.. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా..

Published on Tue, 02/18/2025 - 19:18

జైపూర్‌ : రెండో వివాహం ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిని చిక్కుల్లో పడేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఓ ఐపీఎస్‌ అధికారి హోదా తగ్గించింది. ఈ నిర్ణయంతో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిగా హోదాతో పాటు తీసుకునే పేస్కేలు సైతం తగ్గింది. కొత్తగా విధుల్లో చేరిన ఐపీఎస్‌ ఎంత వేతనం తీసుకుంటారో.. అంతే వేతనం సదరు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారికి అందుతుంది.

పలు నివేదికల ప్రకారం.. రాజస్థాన్‌ కేడర్‌ ఐపీఎస్ అధికారి పంకజ్ కుమార్ చౌదరి జైపూర్‌లో కమ్యూనిటీ పోలీసింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పని చేస్తున్నారు. అయితే పంకజ్‌ కుమార్‌ మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోకుండా రెండో వివాహం చేసుకున్నారు. ఈ వివాదంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ పంకజ్‌ కుటుంబ సభ్యులు రాజస్థాన్‌ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టుకు చేరింది. విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ​పంకజ్‌ కుమార్‌ మీడియాకు వెల్లడించారు.

ఈ తరుణంలో ఐపీఎస్‌ అధికారి పంకజ్‌ కుమార్‌ వివాహంపై రాజస్థాన్‌ రాష్ట్ర ఉన్నాతాధికారులు విచారణ చేపట్టారు. విచారణలో పంకజ్‌ కుమార్‌  దోషిగా తేల్చారు.  విచారణ అనంతరం మూడు సంవత్సరాల పాటు ప్రస్తుతం ఉన్న తన డిజిగ్నేషన్‌ను తగ్గించారు.  లెవల్ 11 సీనియర్ పే స్కేల్ నుండి లెవల్ 10 జూనియర్ పే స్కేల్‌కు కుదించారు. ఈ పేస్కేల్‌ కొత్తగా విధుల్లోకి చేరిన ఐపీఎస్‌లకు కేటాయిస్తారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.  

కాగా, 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి పంకజ్‌ చౌదరి. ప్రస్తుతం,జైపూర్‌లో కమ్యూనిటీ పోలీసింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పని చేస్తున్నారు.  హోదా తగ్గించడంతో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (లెవల్ 10)గా కొనసాగనున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)