Breaking News

నవరాత్రి సందడిలో కారు ప్రమాదం.. 12 మందికి గాయాలు

Published on Mon, 10/07/2024 - 07:55

బరాన్: నవరాత్రి సందడి మధ్య కారు ప్రమాదం చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని బరాన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అత్రు పట్టణంలోని ఖేద్లిగంజ్ కూడలి వద్ద మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ నవరాత్రి సందడిలో మునిగితేలుతున్న జనాలపైకి కారును పోనిచ్చాడు.

ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నదని తెలుస్తోంది. కానిస్టేబుల్ మనోజ్ గుర్జార్ మాట్లాడుతూ కారు డ్రైవర్ హనీ హెడా నుండి రాత్రి 10 గంటల సమయంలో మద్యం మత్తులో బస్టాండ్ నుండి వేగంగా కారులో వస్తున్నాడన్నారు.  ఖేద్లిగంజ్ కూడలిలో  అమ్మవారి హారతి కార్యక్రమంలో పాల్గొన్న జనంపైకి కారును పోనిచ్చాడు. ఆ కారు ఒక స్తంభాన్ని ఢీకొట్టి ఆగిందన్నారు. ఈ ఘటనలో ఒక ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సమాచారం అందుకున్న వెంటనే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేష్‌ మెహతా, పోలీస్‌స్టేషన్‌ హెడ్‌ రామ్‌ప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న భజరంగ్ దళ్ జిల్లా కోఆర్డినేటర్ హిమాన్షు శర్మ, టికం ప్రజాపతి, అడ్వకేట్ హరీష్ గలావ్, ఏబీవీపీ రాహుల్ వర్మ సహా వందలాది మంది ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

ఇది కూడా చదవండి: పట్టాలపై ఇసుక పోసి.. రైలు ప్రమాదానికి మరో కుట్ర
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)