Breaking News

గంగాజలం ఎఫెక్ట్‌.. బీజేపీ నేతపై సస్పెన్షన్‌ వేటు

Published on Tue, 04/08/2025 - 17:16

రాజస్థాన్‌లో వివాదాస్పద నేత జ్ఞానదేవ్ అహూజాపై ఎట్టకేలకు అక్కడి బీజేపీ విభాగం చర్యలు తీసుకుంది. క్రమశిక్షణా చర్యల ఉల్లంఘనకుగానూ షోకాజ్‌ నోటీసు జారీ చేయడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ఆలయంలో గంగా జలంతో శుద్ధి చేయడమే ఇందుకు కారణం!!.

ఆల్వాల్‌లో శ్రీరామ నవమి సందర్భంగా ఓ ఆలయంలో జరిగిన ప్రాణ ప్రతిష్టకు కాంగ్రెస్‌ నేత తికారాం జల్లీ హాజరయ్యారు. అయితే దళిత నేత అడుగుపెట్టి ఆలయం అపవిత్రం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే జ్ఞానదేవ్ అహూజా గంగా జలంతో ఆ ఆలయాన్ని శుద్ధి చేశారు. ఈ పరిణామం దళిత సంఘాలకు ఆగ్రహావేశాలు తెప్పించింది.

ఈ చర్య పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేదిగా ఉందని పేర్కొంటూ బీజేపీ ఎంపీ దామోదర్‌ అగర్వాల్‌ , అహుజాకు నోటీసులు పంపించారు. మూడు రోజుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్‌ రాథోడ్‌కు వివరణ ఇవ్వాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

జ్ఞానదేవ్ అహూజా.. 2013-18 మధ్య రామ్‌ఘడ్‌ ఎమ్మెల్యేగా పని చేశారు. వివాదాల్లో నిలవడం ఈయనకు కొత్తేం కాదు. 2016లో.. జేఎన్‌యూలో జాతీ వ్యతిరేక నినాదాల వ్యవహారంపై స్పందిస్తూ జ్ఞానదేవ్‌ తీవ్రవ్యాఖ్యలే చేశారు. జేఎన్‌యూలో నిత్యం 3 వేల కండోమ్స్‌, 2 వేల లిక్కర్‌ బాటిల్స్‌ దొరుకుతాయంటూ కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. 2017లో గోవుల అక్రమ రవాణా చేస్తున్నాడని పెహ్లూ ఖాన్‌ అనే పాడి రైతును మూక దాడిలో చంపడాన్ని కూడా అహూజా సమర్థించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)