Breaking News

Rajasthan: మంటల్లో మరో బస్సు.. ఇద్దరు మృతి

Published on Tue, 10/28/2025 - 12:16

జైపూర్: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో జరిగిన స్లీపర్‌ బస్సు ప్రమాద ఘటన మరువకముందే, రాజస్థాన్‌లోని మనోహర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోడి గ్రామంలో ఇటువంటి ప్రమాదమే చోటుచేసుకుంది.  కార్మికులను తీసుకెళ్తున్న బస్సు హైటెన్షన్ విద్యుత్ లైన్‌ను తాకడంతో విద్యుదాఘాతం సంభవించింది. దీంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. ఇంతలో బస్సులో మంటలు చెలరేగడంతో, దాదాపు 12 మంది గాయాల పాలయ్యారు.

ఉత్తరప్రదేశ్ నుండి రాజస్థాన్‌లోని మనోహర్ పూర్ పరిధిలోని తోడిలో గల ఇటుకల బట్టీకి కార్మికులను బస్సులో తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మార్గం మధ్యలో బస్సు ప్రమాదవశాత్తూ 11 వేల వోల్ట్‌ల విద్యుత్ లైన్ కు తగిలింది. ఫలితంగా బస్సు గుండా విద్యుత్ ప్రవహించింది. తరువాత బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఆకస్మిక ఘటనతో బస్సులోని ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
 

సమాచారం అందుకున్న మనోహర్ పూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని షాపురా సబ్-జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా కాలిన గాయాలతో బాధపడుతున్న ఐదుగురు కార్మికులను  మెరుగైన చికిత్స కోసం జైపూర్‌కు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపులోనికి తెచ్చారు. రెండు మృతదేహాలను పోలీసులు పోస్ట్ మార్టం కోసం తరలించారు.ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: మరో వివాదంలో ప్రశాంత్‌ కిశోర్‌.. రెండు చోట్ల ఓటు.. టీఎంసీ ఆఫీసే చిరునామా!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)