Breaking News

తృటిలో తప్పిన మరో రైలు ప్రమాదం.. లోకోపైలట్‌ అలర్ట్‌ చేయడంతో..

Published on Sun, 06/18/2023 - 18:40

లక్నో: ఇటీవలే ఒడిషాలో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రయాణికులు మృతిచెందారు. అయితే, తాజాగా ఉత్తరప్రదేశ్‌లో లోకోపైలట్‌ అప్రమత్తతో పెను ‍ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌లో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. యూపీలో ఎండలు దంచికొడుతున్నాయి. కాగా, లక్నోలోని నిగోహన్ రైల్వే స్టేషన్‌లో తీవ్రమైన ఎండ వేడి వల్ల లూప్‌లైన్‌లోని రైల్వే ట్రాక్‌లు కరిగిపోయాయి. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో మెయిన్‌ లైన్‌లో మరో రైలు నిలిచి ఉంది. దీంతో రైలు పట్టాలు కరిగిన లూప్‌ లైన్‌పై నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ వెళ్లింది. ఈ నేపథ్యంలో కరిగిన ఆ రైలు పట్టాలు వ్యాపించడంతో వంకరుగా మారాయి. ఈ క్రమంలో రైలు పట్టాలు జరగడం గమనించిన నీలాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ లోకోపైలట్‌ వెంటనే ఆ రైలును నిలిపివేశాడు. 

అనంతరం, స్టేషన్‌లోని సిబ్బందిని వెంటనే అప్రమత్తం చేశారు. కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో, వెంటనే స్పందించిన స్టేషన్‌ మాస్టర్‌ ఆ లూప్‌లైన్‌ మీదుగా ఎలాంటి రైళ్లు వెళ్లకుండా రైల్వే సిబ్బందిని అలెర్ట్‌ చేశారు. వెంటనే, స్టేషన్‌కు రైల్వే ఇంజినీరింగ్‌ అధికారులు, సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో రైలు పట్టాలను సరి చేసే పనులు చేపట్టారు. అయితే లూప్‌ లైన్‌లోని రైల్వే ట్రాక్‌ నిర్వాహణలో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దీనిపై దర్యాప్తు చేయాలని లక్నో డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ సురేష్ సప్రా ఆదేశించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇది కూడా చదవండి: వీడియో: ఎంపీ, మంత్రి మధ్య వాగ్వాదం.. కలెక్టర్‌ను ఒక్కతోపు తోయడంతో.. 

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)