పార్లమెంట్‌ను సమావేశపర్చండి

Published on Wed, 04/30/2025 - 04:37

సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపర్చాలని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీని కోరారు. ఈ పాశవిక చర్యపై చర్చించడంతోపాటు దేశమంతా ఐక్యంగా ఉందనే విషయాన్ని చాటిచెప్పాల్సిన అవసరముందన్నారు. గత వారం చోటుచేసుకున్న దారుణ ఘటనలో 26 మంది పర్యాటకులు అసువులు బాయడం తెల్సిందే.

ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్‌ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఇప్పటికే కోరారు. ‘ఈ సమయంలో ఐక్యత, సంఘీభావం ప్రకటించాల్సిన అవసరముంది. వీలైనంత త్వరగా పార్లమెంటు ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం ముఖ్యమని ప్రతిపక్షం విశ్వసిస్తోంది.

అమాయక పౌరులపై జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడిని ఎదుర్కోవడానికి మనందరి సమిష్టి సంకల్పానికి ఇది శక్తివంతమైన ప్రదర్శన అవుతుంది’అని ఆయన తెలిపారు. ప్రధానికి రాసిన లేఖలో రాహుల్‌ గాంధీ సైతం ఇదే విషయం తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)