Breaking News

విద్యార్థులపై పోలీసుల బలప్రయోగం.. కేంద్రానికి మరో పరీక్ష!

Published on Mon, 07/27/2026 - 07:51

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభం కానుండగా, విద్యార్థి నిరసనలు, పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పటికీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈ అంశాన్ని ఇంతటితో వదిలిపెట్టే పరిస్థితిలో లేదు.

జూలై 20న జరిగిన సీజేపీ చలో‌ సంసద్ నిరసన సందర్భంగా ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు దాడులు చేశారన్న ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా లేవనెత్తుతోంది. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించారన్న ఆరోపణలపై అమిత్ షాకు లేఖ రాశారు. 19 ఏళ్ల విద్యార్థి సహిల్ లోచాబ్ ఒక కంటిని కోల్పోయే పరిస్థితి వచ్చిందని పేర్కొంటూ, ఇలాంటి బలప్రయోగానికి అనుమతి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. సాధారణ దుస్తుల్లో కనిపించిన వ్యక్తులు విద్యార్థులను లాఠీలతో కొట్టిన ఘటనపై కూడా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మరోవైపు, రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఉపనేత సాగరికా ఘోష్ రూల్ 267 కింద నోటీసు ఇచ్చారు. విద్యార్థులపై జరిగిన దాడులపై సభలో తక్షణమే చర్చ జరపాలని ఆమె కోరారు. అయితే, నిరసనల సందర్భంగా పెల్లెట్ గన్స్ ఉపయోగించలేదని ఢిల్లీ పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF)పై వచ్చిన ఆరోపణల విషయంలో మాత్రం సీఆర్‌పీఎఫ్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.

ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026ను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి నేరాలకు మరింత కఠిన శిక్షలు విధించేలా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయి. సవరణ బిల్లు ప్రకారం, వ్యక్తులకు కనిష్ఠ జైలు శిక్షను మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలకు, గరిష్ఠ శిక్షను పది సంవత్సరాలకు పెంచనున్నారు. గరిష్ఠ జరిమానాను రూ.50 లక్షలకు పెంచడంతో పాటు, సేవలందించే సంస్థలకు రూ.5 కోట్ల వరకు జరిమానా, నిర్వాహకులకు కఠిన శిక్షలు, వ్యవస్థీకృత ప్రశ్నాపత్రాల లీకేజీ నేరాలకు మరింత కఠిన చర్యలు తీసుకునే నిబంధనలు చేర్చారు. అలాగే కేసుల విచారణను వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా బిల్లులో ప్రతిపాదించారు.

ఇక కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీపై కూడా విమర్శలు పెరుగుతున్నాయి. ఇథనాల్ మిశ్రమ ఇంధనం (E20) కారణంగా వాహనాలకు నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ ఈ నెల 31న ఢిల్లీలో మరో నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు కొందరు సిద్ధమవుతున్నారు.

Videos

ఛలో విజయవాడలో ఉద్రికత్త.. పోలీసుల జులుం.. మహిళకు గాయాలు

తొక్కేదాం అని చూసారు.. కానీ కలెక్షన్స్ తో తుక్కు రేగోడుతున్నాడు

FBI పేరుతో అకౌంట్లు బ్లాక్ చేసి.. ఇన్ఫ్లు యెన్సర్లకు 15 వేలు.. కారుమూరి సంచలన నిజాలు

జగన్, చంద్రబాబుల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా..

ముదునూరి మురళీ కృష్ణంరాజుకు వైఎస్ జగన్ పరామర్శ

గణేష్ నిమజ్జనంలో సజ్జనార్ డ్యాన్స్ వైరల్

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం

Photos

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)