Breaking News

ఓట్‌ అధికార్‌ యాత్ర.. రాహుల్‌ కారు ఢీకొని గాయపడ్డ కానిస్టేబుల్‌

Published on Tue, 08/19/2025 - 19:15

పాట్నా:  కేంద్రంతో  ఎలక్షన్‌ కమిషన్‌ కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడిందంటూ గత కొన్ని రోజులుగా విమర్శలు గుప్పిస్తున్న ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ.. బిహార్‌లో ఓట్‌ అధికార్‌ యాత్ర చేపట్టారు.  స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ పేరుతో బీహార్‌లో 65  లక్షల ఓట్లు తొలగింపును వ్యతిరేకిస్తూ రాహుల్‌.. ఓట్‌ అధికార్‌ యాత్ర చేపట్టారు. అయితే ఈ యాత్ర ప్రస్తుతం బీహార్‌లోని నవాడా  జిల్లాలో కొనసాగుతోంది. 

రాహుల్‌ గాంధీ, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌ ప్రయాణిస్తున్న వాహనం ఢీ కొని ఓ పోలీసు కానిస్టేబుల్‌ గాయపడ్డాడు. ర్యాలీలో  జనాన్ని నియంత్రిస్తున్న సమయంలో ఓ కానిస్టేబుల్‌ కాలు కారు కింద చిక్కుకుపోయింది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనిపై బీజేపీ విమర్శలు గుప్పిస్తుంది. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలైతే రాహుల్‌ కనీసం అతన్ని కారు కిందకు దిగి పలకరించలేదని విమర్శలు గుప్పించింది. ఈ ప్రమాద వీడియోను షేర్‌ చేస్తూ రాహుల్‌పై విరుచుకు పడింది.

 

గత 40 గంటలుగా రాహుల్‌ బీహార్‌లో చేస్తున్న యాత్రలో ఒక్క నిజంగా మాట్లాడటం లేదని బీజేపీ ధ్వజమెత్తింది. ఎలక్షన్‌ కమిషన్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్న రాహుల్‌..  ఓట్‌ చోరీ అంశానికి సంబంధించి ఆధారాలు చూపెట్టాలని డిమాండ్‌ చేసింది. ప్రజల విశ్వాసాన్ని రాహుల్‌ గాయపరుస్తున్నాని మండిపడింది. ఒక విషయాన్ని నిజమని నమ్మాలంటే ఆధారాలు ఉండాలి కదా అని బీహార్‌ బీజేపీ ప్రశ్నించింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)