Breaking News

అనర్హత వేటు.. ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేసిన రాహుల్‌ గాంధీ

Published on Fri, 04/14/2023 - 18:27

సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. తనపై అనర్హత వేటు కారణంగా ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను శుక్రవారం ఖాళీ చేశారు. ఏప్రిల్ 22లోగా ఆయన తన బంగ్లాను ఖాళీ చేయాలని లోక్‌సభ హౌజింగ్ కమిటీ గతంలోనే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌ తన బంగ్లాను ఈరోజు ఖాళీ చేశారు. దీంతో, ఢిల్లీ 12 తుగ్లక్ లైన్‌లోని ప్రభుత్వ బంగ్లాలో ఉన్న ఆయన సామాన్లను ట్రక్కుల్లో తరలించారు. 

అయితే, పరువు నష్టం కేసులో సూరత్‌ కోర్టు రాహుల్‌ గాంధీకి జైలు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీంతో, వెంటనే రాహుల్‌పై అనర్హత వేటు పడింది. సూరత్ కోర్ట్ తీర్పు ప్రకారం లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనపై వెంటనే చర్యలకు దిగింది. భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8లోని ఆర్టికల్ 102(1)(e) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కేరళలోని వయనాడ్ లోక్‌సభ సభ్యత్వం నుంచి అనర్హత వేటు పడింది. ఇదిలా ఉండగా.. రెండేళ్ల జైలుశిక్ష తీర్పును నిలిపేయాలని కోరుతూ దాఖలైన అప్పీలుపై సూరత్ సెషన్స్ కోర్టు ఏప్రిల్‌ 20వ తేదీన విచారణ చేపట్టనుంది. 

ఇక, రాహుల్ గాంధీ లోక్‌సభకు వరుసగా నాలుగోసారి ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ తొలిసారిగా అమెథీ నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో, ఆయనకు ఢిల్లీలోని తుగ్లక్‌ లేన్‌లో బంగ్లాను కేటాయించారు. నాటి నుంచి ఆయన అక్కడే నివాసం ఉంటున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)