Breaking News

వయనాడ్‌ నుంచి నామినేషన్‌ వేసిన రాహుల్‌ గాంధీ

Published on Wed, 04/03/2024 - 14:33

తిరువనంతపురం: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి బుధవారం నామినేషన్‌ వేశారు. వయనాడ్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న రాహుల్‌.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి ఇక్కడి నుంచి బరిలో నిలిచారు. ఈ క్రమంలోనే నేడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. రాహుల్‌ వెంట తన సోదరి ప్రియాంక గాంధీ, ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌, ఇతర పార్టీ సీనియర్‌ నేతలు కూడా ఉన్నారు. 

కాగా బుధవారం ఉదయం వయనాడ్‌ చేరుకున్న రాహుల్‌.. కాల్‌పేట నుంచి సివిల్‌ స్టేషన్‌ వరకు రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత మాట్లాడుతూ.. తాను ఎల్లప్పుడూ వయనాడ్‌ ప్రజలతో ఉంటానని చెప్పారు. ఇక్కడి ప్రతివ్యక్తి తనపై ప్రేమ, అభిమానాన్ని అందించారని, సొంత వ్యక్తిలా చూసుకున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాంతం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తుండటం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. 

ఇక 2019 ఎన్నికల్లో వయనాడ్‌ నుంచి రాహుల్‌ గాంధీ ఏడు లక్షల ఓట్లతో గెలుపొందారు. సమీప అభ్యర్థి సీపీఐ అభ్యర్ధి సునీర్‌పై 4.31 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇదే వయనాడ్‌ నుంచి బీజేపీ తరపు రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్‌, సీపీఐ నేత అనీ రాజా పోటీలో నిలిచారు. రెండో ఫేజ్‌లో భాగంగా ఏప్రిల్‌ 26న కేరళలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్‌ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. 
చదవండి: అవమానించేందుకే అరెస్ట్‌ చేశారు: కేజ్రీవాల్‌

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)