Breaking News

అమిత్‌షా ఆదేశాల ప్రకారమే దాడులు.. రాహుల్‌

Published on Wed, 07/29/2026 - 13:12

సాక్షి, ఢిల్లీ: పేపర్‌ లీక్‌పై ఏం జరిగిందో ప్రభుత్వానికి తెలియాలంటే బీజేపీ ఎంపీలు వారి పిల్లలను అడగాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అ‍న్నారు. యాంటీ పేపర్  లీక్‌ బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు. నీట్‌ పేపర్‌ లీక్‌పై విద్యార్థులు శాంతియుత నిరసన చేపట్టారని అన్ని పార్టీలు విద్యార్థులు ఆందోళనను గౌరవించాలన్నారు. ఢిల్లీ వీధుల్లో జరిగింది నిరసన కాదని ‍అది భావప్రకటన స్వేచ్ఛని రాహుల్‌ గాంధీ కేంద్రాన్ని దుయ్యబట్టారు.

విద్యావ్యవస్థ క్రూరంగా మారిపోయింది. విద్యను ప్రైవేటీకరించారు. విద్యను ఆరెస్సెస్‌మయం చేశారు. ఇది యూపీఏ పాలన.. మా మంత్రి రాజీనామా చేయరని మరో మంత్రి రాజ్‌నాథ్‌ అన్నారు. ధర్మేంద్ర ప్రదాన్‌ను విద్యాశాఖ మంత్రి అని మేం అనుకోలేదు. దేశంలో విద్యాశాఖను ఆరెస్సెస్‌నడిపిస్తోంది. దేశంలోని అన్ని యూనివర్సిటీలకు ఆరెస్సెస్‌ మనుషులే వీసీలుగా ఉన్నారు ఉన్నారు.

భయాన్ని దాటుకుని విద్యార్థులు పోరాటం చేశారు. విద్యార్థులపై దాడికి హోం మంత్రే ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులపై పెల్లెట్స్‌ దాడికి హోం మంత్రే కారణం. నీట్‌పై చర్చ జరుగుతున్న సమయంలో హోం మంత్రి ఇప్పుడు ఇక్కడ ఎందుకు లేరు?. ఆయనకి ఇక్కడ కూర్చునే ధైర్యం లేదు. ఆయన భయంతో వణికిపోతున్నారు. పోలీసుల చర్యపై విద్యార్థులకు అమిత్‌ షా క్షమాపణలు చెప్పాలి అని రాహుల్‌ డిమాండ్‌ చేశారు.

రిజిజు అభ్యంతరం
కాగా రాహుల్‌ ప్రసంగంపై దుమారం చెలరేగింది. ఆయన చేసిన ‘ఇడియట్స్‌’ వ్యాఖ్యలతో ఎన్డీయే ఎంపీలు ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ వ్యాఖ్యలపై అని పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్‌ రిజిజు అభ్యంతరం వ్యక్యం చేశారు. అన్‌ పార్లమెంటరీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. ఆ సమయంలో స్పీకర్‌ ‘హుందాగా వ్యవహరించాలి’ అని సభ్యులను ఉద్దేశించి సూచించారు. 

రాహుల్‌వి తప్పుడు ఆరోపణలన్న కిరెన్‌ రిజిజు.. ఆధారాల్లేకుండా ఆయన ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ‘‘విద్యార్థుల పేరుతో అనుచిత వ్యాఖ్యలు సరికాదు. హోం మంత్రే ఆదేశాలు ఇచ్చారని ఎలా అంటారు. రాహుల్‌ క్షమాపణలు చెప్పాలి’’ మంత్రి డిమాండ్‌ చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)